Hardik Pandya Ferrari 12Cilindri: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య మరోసారి వార్తల్లో నిలిచాడు. ఈసారి మైదానంలో తన ఆటతో కాదు.. తన ఖరీదైన కారు కారణంగా సోషల్ మీడియాలో సందడి చేస్తున్నాడు. బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో ప్రాక్టీస్ ముగించుకున్న హార్దిక్.. తన కొత్త ఫెరారీ 12సిలిండ్రీతో వెళ్లిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
తన కారును చూసి.. ఫొటో తీసుకున్న హార్దిక్..!
వైరల్ వీడియోలో ప్రాక్టీస్ సెషన్ ముగించుకున్న హార్దిక్ పాండ్యా.. ట్రైనింగ్ దుస్తులు, స్లైడ్స్‌తో బయటకు వస్తూ కనిపించాడు. అనంతరం అక్కడ పార్క్ చేసి ఉన్న తన స్కై బ్లూ రంగు ఫెరారీ 12సిలిండ్రీని చూసి కాసేపు ఆగాడు. వెంటనే ఫోన్ తీసి తన కారును ఫొటో తీశాడు. ఆ తర్వాత కారు వద్దకు వెళ్లి ఇంటికి బయలుదేరాడు.
Hardik Pandya has changed the colour of his Ferrari, this is its new look. pic.twitter.com/UZekzAaFXH
— 𝐑𝐮𝐬𝐡𝐢𝐢𝐢⁴⁵ (@rushiii_12) May 23, 2026
తన సొంత కారును హార్దిక్ ఇలా ఫొటో తీసుకోవడం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. క్రికెట్‌లో అగ్రస్థాయికి చేరుకున్నప్పటికీ.. తాను ఎంతో ఇష్టపడే కారును చూసి సాధారణ కార్ల అభిమాని మాదిరిగానే హార్దిక్ మురిసిపోయాడంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
ఎక్కువమంది చదివినది: Team India: జట్టు నుంచే కాదు, కెప్టెన్సీ పోస్ట్ కూడా పీకేస్తారనుకోలే..: సూర్య షాకింగ్ కామెంట్స్..!
ఫెరారీ ప్రత్యేకతలేంటి..?
Hardik Pandya spotted in his 12 crore worth Ferrari 12 Cilindri arriving for the MI vs RR match pic.twitter.com/Pf027AqeTS
— ” (@Im_Blazee) May 24, 2026
హార్దిక్ పాండ్య గ్యారేజీలో చేరిన ఫెరారీ 12సిలిండ్రీ విలువ సుమారు రూ.12 కోట్లు ఉంటుందని కథనాలు పేర్కొంటున్నాయి. ఈ లగ్జరీ కారు సహజసిద్ధంగా పనిచేసే 6.5 లీటర్ల V12 ఇంజిన్తో వస్తుంది. క్లాసిక్ గ్రాండ్ టూరర్ డిజైన్‌కు ఆధునిక ఏరోడైనమిక్ టెక్నాలజీని జోడించారు.
ఎక్కువమంది చదివినది: Team India: ఇకపై నో బాల్స్ వేస్తే జేబుకు చిల్లే.. ఫైన్‌తోపాటు టీంమేట్స్‌కు డిన్నర్ పార్టీ..!
2026 మార్చిలోనూ హార్దిక్ ఈ ఫెరారీని నడుపుతున్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఫెరారీ 12సిలిండ్రీలో 6.5 లీటర్ల V12 ఇంజిన్, సుమారు 819-830 బీహెచ్‌పీ శక్తి వంటి ప్రత్యేకతలు ఉన్నట్లు ఇతర ఆటోమొబైల్, క్రీడా కథనాలు పేర్కొన్నాయి.
Hardik Pandya leaving after the RR vs MI match in his Ferrari 12 cilindri 🔥 pic.twitter.com/Fv7CpaqOBB
— ” (@Im_Blazee) May 24, 2026
మైదానంలో పవర్‌ఫుల్ హిట్టింగ్‌తో అభిమానులను అలరించే హార్దిక్.. ఇప్పుడు తన లగ్జరీ కారుతోనూ అదే స్థాయిలో ఫ్యాన్స్ దృష్టిని ఆకర్షిస్తున్నాడు. బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ వద్ద చోటుచేసుకున్న ఈ చిన్న వీడియో సోషల్ మీడియాలో మాత్రం పెద్ద చర్చకు దారితీసింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..