Headlines

Anand Deverakonda: చెన్నై లవ్ స్టోరీ సినిమాను నేను వైష్ణవి చేయాల్సింది.. కానీ చేయకపోవడానికి కారణం ఇదే.. ఆనంద్ దేవరకొండ… | Anand Deverakonda Opens Up On About Why He and Vaishnavi Chaitanya Missed Chennai Love Story Movie


ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ లవబుల్ హిట్ పెయిర్ అంటే ఠక్కున గుర్తొచ్చే జంటలలో వైష్ణవి చైతన్య, ఆనంద్ దేవరకొండ ఒకటి. వీరిద్దరు కలిసి నటించిన బేబీ సినిమా సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వీరిద్దరి కాంబోలో మరో ప్రాజెక్ట్ సైతం ప్రకటించారు. కానీ ఆ తర్వాత అనుహ్యంగా ఆ సినిమా నుంచి ఇద్దరూ తప్పుకున్నారు. అదే చెన్నై లవ్ స్టోరీ. తర్వాత ఈ చిత్రాన్ని కిరణ్ అబ్బవరం, గౌరీ ప్రియతో తెరకెక్కించగా.. ఇటీవల బాక్సాఫీస్ వద్ద ప్రేక్షకులను మెప్పించింది ఈ సినిమా. అయితే ఇప్పుడు వైష్ణవి, ఆనంద్ జంటగా నటిస్తున్న సినిమా ఎపిక్. యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 11న రిలీజ్ చేయనున్నారు. ఈ మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉంది చిత్రయూనిట్. ఈ క్రమంలోనే తాజాగా ఆనంద్ దేవరకొండ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ చెన్నై లవ్ స్టోరీ సినిమా మిస్ కావడం వెనుక ఉన్న కారణాలను వెల్లడించారు.

ఎక్కువమంది చదివినవి : Tollywood: కొత్తింట్లోకి అడుగుపెట్టిన టాలీవుడ్ హీరోయిన్.. ఫ్యామిలీతో కలిసి గృహ ప్రవేశం.. ఫోటోస్ వైరల్..

చెన్నై లవ్ స్టోరీ చిత్రంలో మొదటగా తాను, నటి వైష్ణవి చైతన్య జంటగా నటించాల్సి ఉండేదని నటుడు ఆనంద్ దేవరకొండ తాజాగా చెప్పుకొచ్చారు. గత కొంతకాలంగా సాగుతున్న ఈ చర్చకు తెరదించుతూ, ఈ వార్త నిజమేనని ఆయన స్వయంగా వెల్లడించారు. ఈ ప్రాజెక్ట్ మొదటగా ప్లాన్ చేసినప్పుడు, ఆనంద్, వైష్ణవిల జోడీని పరిశీలించినట్లు తెలిపారు. అయితే, ఈ చిత్రం కార్యరూపం దాల్చడానికి ఎక్కువ సమయం పట్టిందని ఆనంద్ వివరించారు. స్క్రిప్ట్ రైటింగ్ , డెవలప్‌మెంట్ ప్రక్రియ అనుకున్నదానికంటే ఎక్కువ ఆలస్యం కావడంతో, షెడ్యూలింగ్ సమస్యలు తలెత్తాయి. “నేను ఇంకో సినిమా స్టార్ట్ చేయాలి అన్నప్పుడు వాళ్లు ఓకే, వీల్ డు దిస్ ఫిల్మ్ విత్ సం అదర్ హీరో అన్నారు” అని ఆనంద్ పేర్కొన్నారు. మరో హీరోతో సినిమాను తీయాలని నిర్మాతలు నిర్ణయించుకున్నారని, ఈ జంట మార్పు వెనుక వేరే కారణాలు లేవని ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా, ఆనంద్ దేవరకొండ , వైష్ణవి చైతన్య కలిసి చెన్నై లవ్ స్టోరీలో నటించే అవకాశం చేజారిపోయింది.

ఎక్కువమంది చదివినవి : Nagarjuna : ఆయన తినే రైస్ మనం తినలేము.. నాగార్జున డైట్ రివీల్ చేసిన మేకప్ ఆర్టిస్టు..

చెన్నై లవ్ స్టోరీ సినిమాలో కిరణ్ అబ్బవరం, శ్రీ గౌరీ ప్రియ జంటగా నటించారు. ‘కలర్ ఫోటో’, ‘బేబి’ వంటి విజయవంతమైన చిత్రాలను అందించిన ఎస్.కె.ఎన్ (SKN), సాయి రాజేష్ ఈ చిత్రాన్ని నిర్మించారు. దాదాపు రూ.15 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని సాధించి రూ.60 కోట్ల వరకు వసూలు చేసింది. ప్రస్తుతం ఈ మూవీ ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్ లో స్ట్రీమింగ్ అవుతుంది.

ఎక్కువమంది చదివినవి : Cinema : దేశాన్ని కుదిపేసిన నిజమైన సంఘటనతో తీసిన సినిమా.. ఓటీటీలో భయం పుట్టించింది.. ట్రెండింగ్‌లో నంబర్ వన్..

ఎక్కువమంది చదివినవి : Soundarya: సౌందర్య ఫస్ట్ సినిమా హీరో ఇప్పుడేం చేస్తున్నాడో తెలుసా.. ? 13 ఏళ్లకే స్టార్ డమ్.. ఇప్పుడు ఇలా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *