Headlines

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల | Snake Rescued After Getting Head Stuck in Energy Drink Can in Mahabubnagar video tv9d – Viral Videos in Telugu

Viral Video: ఎనర్జీ డ్రింక్ టిన్‌లో ఇరుక్కున్న పాము.. బయటికి రాలేక విలవిల | Snake Rescued After Getting Head Stuck in Energy Drink Can in Mahabubnagar video tv9d – Viral Videos in Telugu


మననుషులు చేసే తప్పిదాలకు సాటి మానవులే కాదు.. మూగజీవాలు కూడా ఇబ్బదులు పడుతున్నాయి. అందుకు ఉదహారణే ఈ ఘటన. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం ఉదండాపూర్ ప్రాజెక్టు సమీపంలో ఒక విచిత్రమైన సంఘటన జరిగింది. రోడ్డు పక్కన పడేసిన ఒక ఎనర్జీ డ్రింక్ ఖాళీ టిన్‌లో ఓ పాము తల ఇరుక్కుపోయింది. బయటకు రాలేక ఆ పాము పడిన వేదన స్థానికులను తీవ్రంగా కలచివేసింది. డబ్బాలో తల ఇరుక్కొని దారి తెలియక.. దిక్కుతోచని స్థితిలోఉన్న పామును గమనించిన స్థానికులు వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. సమయానికి స్పందించిన అటవీశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని ఎంతో నైపుణ్యంతో, జాగ్రత్తగా ఆ టిన్‌ను కోసి పామును సురక్షితంగా బయటకు తీశారు. అనంతరం దానిని సురక్షితంగా సమీప దట్టమైన అటవీ ప్రాంతంలో విడిచిపెట్టడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మనం నిర్లక్ష్యంగా పడేసే ప్లాస్టిక్ బాటిళ్లు, టిన్లు, గాజు సీసాలు మూగజీవుల ప్రాణాలకు ఎంత పెద్ద ముప్పుగా మారుతున్నాయో చెప్పడానికి ఈ ఘటన ఒక ఉదాహరణ. పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకోవాలని, వ్యర్థాలను ఎక్కడపడితే అక్కడ పడేయకుండా బాధ్యతాయుతంగా పారవేయాలని అటవీశాఖ అధికారులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. మన చిన్న నిర్లక్ష్యం మరొక జీవి ప్రాణానికే ప్రమాదంగా మారకూడదని హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

మాట నిలబెట్టుకున్న సర్పంచ్‌.. ప్రశంసలు కురిపిస్తున్న స్థానికులు

తిరుమలలో పాలలా మారిన నీళ్లు.. తిరుమలలో పాలలా మారిన నీళ్లు..

Viral Video: పక్షుల గూటిలో వింత శబ్దాలు.. ఏం జరిగిందో తెలుసా?

Chiranjeevi: రమేష్‌ కుటుంబానికి చిరంజీవి సాయం!

Mahesh Babu: మా అబ్బాయి వస్తున్నాడు.. ఆదరించండి!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *