Headlines

Viswanath And Sons: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో అతనేనా? | Is This Tollywood Star Actor Rejected Suriya Role In Viswanath And Sons Movie, Details Here

Viswanath And Sons: సూర్య ‘విశ్వనాథ్ అండ్ సన్స్’ సినిమాను రిజెక్ట్ చేసిన టాలీవుడ్ స్టార్ హీరో అతనేనా? | Is This Tollywood Star Actor Rejected Suriya Role In Viswanath And Sons Movie, Details Here


తమిళ హీరో సూర్య నటించిన లేటెస్ట్ చిత్రం ‘విశ్వనాధ్ అండ్ సన్స్’. వెంకీ అట్లూరి తెరకెక్కించిన ఈ సినిమాలో మమితా బైజు హీరోయిన్ గా చేసింది. అలాగే సీనియర్ హీరోయిన్లు రాధిక, రవినా టాండన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. రిలీజ్ కు ముందే ఈ సినిమాకు పాజిటివ్ వైబ్ క్రియేట్ అయ్యింది. టీజర్ , ట్రైలర్ , పాటలు చూసి కచ్చితంగా ఈ సినిమా సూపర్ హిట్ అనుకున్నారు. అందుకు తగ్గట్టుగానే ఇవాళ (ఆగస్టు 14)న రిలీజైన విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా అందరి అంచనాలను అందుకుంది. మొదటి షో నుంచే సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. తెలుగు , తమిళ భాషల్లోనూ ఈ సినిమాకు సూపర్బ్ రెస్పాన్స్ వస్తోంది. రివ్యూలకు తోడు మౌత్ టాక్ బాగా ఉండడంతో బుక్ మై షో యాప్ లో ఈ చిత్రానికి గంటకు 20 వేలకు పైగా టికెట్స్ అమ్ముడుపోతున్నాయి. సూర్య, మమితల నటన, వెంకీ అట్లూరి మేకింగ్ కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. అలాగే ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్ కు ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అవుతున్నారు. మొత్తానికి కరుప్పు (తెలుగులో వీరభద్రుడు) తర్వాత విశ్వనాథ్ అండ్ సన్స్ రూపంలో సూర్యకు మరో మంచి సాలిడ్ హిట్ దొరికిందని అభిమానులు సంబరపడుతున్నారు.

ఇదిలా ఉంటే విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా రిలీజ్ నేపథ్యంలో ఈ మూవీ గురించి ఒక ఆసక్తికర వార్త నెట్టింట బాగా వైరల్ అవుతోంది. అదేంటంటే.. ఈ సినిమాకు ఫస్ట్ హీరో సూర్య కాదంట. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో ఈ సినిమాను చేద్దామనుకున్నారట మేకర్స్. ఇందుకోసం ముందుగా ఈ సబ్జెక్టు ని వెంకీ అట్లూరి త్రివిక్రమ్ శ్రీనివాస్ కి చెప్పగానే ఆయన వెంటనే కళ్యాణ్ తో చేద్దామని అన్నారట. అయితే అప్పటికే పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో పూర్తి బిజీ అయిపోయారు. దీనికి తోడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను కూడా పూర్తి చేయాల్సి ఉండడంతో వేరే దారి లేక ఈ సినిమాను పక్కన పెట్టారట. అలా ఈ కథలోకి హీరో సూర్య ఎంటర్ అయ్యారట.

నిజానికి ముందుగా సూర్య తో ఒక బయోపిక్ చెయ్యాలని అనుకున్నాడట డైరెక్టర్ వెంకీ అట్లూరి. కానీ పవన్ కళ్యాణ్ ‘విశ్వనాథ్ & సన్స్’ సబ్జెక్టుపై పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో అదే కథను సూర్యతో చేశారట వెంకీ. ఇందులో నిజమెంతుందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ విషయం నెట్టింట వైరల్ గా మారింది. ఒక వేళ పవన్ కల్యాణ్ ఈ సినిమా చేసి ఉంటే అత్తారింటికి దారేది తరహాలో ఇండస్ట్రీ హిట్ అయ్యుండేదని ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి



విశ్వనాథ్ అండ్ సన్స్ సినిమా ట్రైలర్..


మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *