Headlines

తక్కువ ధరలో అదిరిపోయే ఇయర్ బడ్స్‌ కావాలా? ట్రూక్ మెగా7 బెస్ట్‌..ఎందుకంటే | Truke Mega 7 TWS Earbuds Launched: 60 Hours Battery & Spatial Audio Under 1000

తక్కువ ధరలో అదిరిపోయే ఇయర్ బడ్స్‌ కావాలా? ట్రూక్ మెగా7 బెస్ట్‌..ఎందుకంటే | Truke Mega 7 TWS Earbuds Launched: 60 Hours Battery & Spatial Audio Under 1000


ప్రస్తుతం వైర్‌లెస్ ఇయర్ బడ్స్ వాడకం విపరీతంగా పెరిగింది. సామాన్యులకు సైతం ప్రీమియం ఫీల్ పంచేందుకు ప్రముఖ ఆడియో బ్రాండ్ ట్రూక్ తన కొత్త మోడల్‌ను మార్కెట్లో విడుదల చేసింది. రాయల్ లుక్‌ను ఇచ్చే డిజైన్, శక్తివంతమైన ఆడియో పనితీరుతో ఇది అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తక్కువ ధరలో ఎక్కువ హంగులు కోరుకునేవారికి ఇది సరైన ఎంపిక. ఈ అద్భుతమైన ఇయర్ బడ్స్ పూర్తి విశేషాలు తెలుసుకుందాం.

24-బిట్ స్పేషియల్ ఆడియో

ఈ ఇయర్ బడ్స్ చూడటానికి అత్యంత ఆకర్షణీయంగా ఉండటమే కాకుండా ప్రీమియం లెదర్ ఫినిష్‌ కేస్‌తో వస్తాయి. చేతిలో పట్టుకోవడానికి చాలా కంఫర్టబుల్‌గా ఉండి రాయల్ లుక్‌ను ఇస్తాయి. ఈ బడ్జెట్ ఇయర్ బడ్స్ హైలైట్ వీటిలోని ఆడియో పర్ఫార్మెన్స్. ఇందులో శక్తివంతమైన 13mm టైటానియం డ్రైవర్లను వాడారు. దీనికి తోడు 24-బిట్ 360 డిగ్రీల స్పేషియల్ సౌండ్ సపోర్ట్ లభిస్తుంది. దీని వల్ల పాటలు వింటున్నప్పుడు లేదా సినిమాలు చూస్తున్నప్పుడు శబ్దం నలుమూలల నుంచి స్పష్టంగా వినిపించి థియేటర్ ఫీల్ కలుగుతుంది. డీప్ బేస్, క్రిస్టల్ క్లియర్ హైస్ దీని సొంతం. ఆడియో ప్రేమికులు కోరుకునే పర్ఫెక్ట్ సౌండ్ క్వాలిటీ ఇందులో లభిస్తుంది.

కాలింగ్ ఫీచర్లు

ప్రయాణాలు చేసే వారికి ఎలాంటి టెన్షన్ లేకుండా ఉండేలా ఈ ఇయర్ బడ్స్ అద్భుతమైన బ్యాకప్‌ను అందిస్తాయి. ఛార్జింగ్ కేస్‌తో కలిపి మొత్తం 60 గంటల పాటు నాన్‌స్టాప్ ప్లేటైమ్‌ను ఇస్తుంది. ఇందులో టైప్-సి ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. కేవలం 10 నిమిషాలు ఛార్జ్ చేస్తే చాలు గంటల తరబడి మ్యూజిక్ ఎంజాయ్ చేయవచ్చు. గేమ్‌లు ఆడేవారి కోసం ప్రత్యేకంగా అల్ట్రా-లో లాటెన్సీ మోడ్ ఇవ్వబడింది. దీని వల్ల గేమింగ్ సమయంలో ఆడియో, వీడియో మధ్య ఎలాంటి జాగ్ లేదా డిలే ఉండదు.

ఫోన్ కాల్స్ మాట్లాడుకునేటప్పుడు ఎదుటివారికి గొంతు స్పష్టంగా వినిపించేందుకు క్వాడ్-మిక్ ENC టెక్నాలజీ సహకరిస్తుంది. రద్దీగా ఉండే ప్రదేశాల్లో కూడా బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను ఇది సమర్థవంతంగా అడ్డుకుంటుంది. అన్ని లేటెస్ట్ ఫీచర్లు కలిగిన ఈ ట్రూక్ మెగా 7 ఇయర్ బడ్స్ అసలు ధర మార్కెట్లో ఎక్కువగా ఉన్నప్పటికీ ఆఫర్ కింద కేవలం రూ. 999 ధరకే అందుబాటులో ఉన్నాయి. కోల్ బ్లాక్, కాఫీ బ్రౌన్ వంటి కలర్ ఆప్షన్లలో ఇవి లభిస్తున్నాయి. రూ. 1,000 బడ్జెట్‌లో బెస్ట్ సౌండ్ క్వాలిటీ కోరుకునే వారికి ఇది పర్ఫెక్ట్ వాల్యూ ఫర్ మనీ ప్రొడక్ట్.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *