Headlines

Wi-Fi: ఇంట్లో వై-ఫై వాడుతున్నారా..? ఈ చిన్న తప్పు చేస్తే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయినట్లే.. | Using home wi fi enable guest wifi to protect your devices from cyber threats

Wi-Fi: ఇంట్లో వై-ఫై వాడుతున్నారా..? ఈ చిన్న తప్పు చేస్తే మీ అకౌంట్ మొత్తం ఖాళీ అయినట్లే.. | Using home wi fi enable guest wifi to protect your devices from cyber threats


ఇటీవల ప్రతీఒక్కరి ఇంట్లో వైఫై అనేది తప్పనిసరిగా మారిపోయింది. వర్క్ ఫ్రం హోమ్, రిమోట్ జాబ్‌లతో పాటు ఆన్‌లైన్, మొబైల్ ద్వారా సులువుగా సేవలు పొందే అవకాశం ఉండటంతో వైఫైతో అవసరం పడుతుంది. ఆన్‌లైన్ చెల్లింపుల నుండి స్మార్ట్ హోమ్ పరికరాల వరకు అన్నింటికీ వైఫై అనేది ఉపయోగపడుతుంది. అయితే వైఫై వినియోగంతో పాటు సైబర్ నేరాలు కూడా పెరిగిపోతున్నాయి. దీంతో వైఫై ఉపయోగించే సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా వైఫై పాస్‌వర్డ్‌ను ఇతరులకు షేర్ చేసుకునే సమయంలో జాగ్రత్తగా ఉండాలి. గెస్ట్ Wi-Fi ఫీచర్ ఉపయోగించడం వల్ల మీ వైఫై సైబర్ దాడులకు గురి కాకుండా కాపాడుకోవచ్చు.

గెస్ట్ వై-ఫై అంటే ఏంటి?

మీ ప్రధాన ఇంటి వై-ఫైతో పాటుగా సృష్టించడ్డ ఒక ప్రత్యేక వైర్‌లెస్ నెట్‌వర్క్‌నే గెస్ట్ వైఫై. ఇది మీ ప్రాథమిక నెట్‌వర్క్‌కు కనెక్ట్ అవ్వకుండానే గెస్ట్‌లు ఇంటర్నెట్‌ను ఉపయోగించుకోవడానికి వీలు కల్పిస్తుంది. మీ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ టీవీలు, సీసీటీవీ కెమెరాలు, ప్రింటర్లు, నాస్ స్టోరేజ్ సిస్టమ్‌లతో పాటు ఇతర స్మార్ట్ హోమ్ గాడ్జెట్‌ల వంటి పరికరాలు గెస్ట్ పరికరాల నుండి వేరుగా, సురక్షితంగా ఉంటాయి. దీని వల్ల మీ పరికరాలకు మెరుగైన భద్రత ఉంటుంది. ఈ ఫీచర్ వల్ల గెస్టులు మీ ఇంటర్నెట్‌ను వాడుకోవచ్చు. కానీ మీ వైఫైతో లింక్ చేయబడ్డ పరికరాలను యాక్సెస్ చేయలేరు. స్మార్ట్ బల్బులు, కెమెరాలు, స్పీకర్లు, స్మార్ట్ లాక్‌లతో సహా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ పరికరాలకు అదనపు రక్షణను ఇదిఅందిస్తుంది.

పాస్ వర్డ్ లీక్ అయినా ఇబ్బంది ఉండదు

మీ గెస్ట్ Wi-Fi పాస్‌వర్డ్ షేర్ చేయబడ్డా లేదా లీక్ అయినా మీ ప్రధాన Wi-Fi క్రెడెన్షియల్స్‌కు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మీరు గెస్ట్ నెట్‌వర్క్ పాస్‌వర్డ్‌ను మార్చుకోవచ్చు. గెస్ట్ నెట్‌వర్క్‌ ఇంటర్నెట్ వేగం, వినియోగ సమయం, గరిష్ట పరికరాల సంఖ్యకు సంబంధించ మీరు పరిమితులు సెట్ చేసుకోవచ్చు .మీ ప్రధాన Wi-Fi పాస్‌వర్డ్‌ను అందరికీ అందుబాటులో ఉంచడం వల్ల సైబర్ ముప్పులు పెరిగే అవకాశం ఉంది. వైరస్ సోకిన ఫోన్ లేదా ల్యాప్‌టాప్ నెట్‌వర్క్‌లోకి మాల్‌వేర్‌ను ప్రవేశపెట్టవచ్చు. హ్యాకర్లు ఇతర కనెక్ట్ చేయబడిన పరికరాలను యాక్సెస్ చేయడానికి ప్రయత్నించవచ్చు. ఫైల్ షేరింగ్ ఎనేబుల్ చేసి ఉంటే సున్నితమైన డేటా కూడా బహిర్గతమయ్యే అవకాశం ఉంది. దీంతో గెస్ట్ నెట్‌వర్క్‌లను వేరుగా ఉంచాలని సైబర్‌సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *