Headlines

WTC 2026 : టెస్టు సంగ్రామానికి కౌంట్‌డౌన్.. WTC ఫైనల్ కోసం గిల్ సేనకు ఇదే అసలైన ఛాలెంజ్! | Gautam Gambhir Under Pressure Ahead of Sri Lanka Test Series Deep Dasgupta Issues Major Warning

WTC 2026 : టెస్టు సంగ్రామానికి కౌంట్‌డౌన్.. WTC ఫైనల్ కోసం గిల్ సేనకు ఇదే అసలైన ఛాలెంజ్! | Gautam Gambhir Under Pressure Ahead of Sri Lanka Test Series Deep Dasgupta Issues Major Warning


WTC 2026 : కొద్దిరోజుల విశ్రాంతి తర్వాత భారత క్రికెట్ జట్టు మళ్లీ రెడ్ బాల్ క్రికెట్లోకి దిగబోతోంది. ఆగస్టు 15 నుంచి శ్రీలంకతో ప్రారంభం కానున్న రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌తో టీమిండియా తన పర్యటనను ప్రారంభించనుంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (WTC) ఫైనల్ ఆశలను సజీవంగా ఉంచుకోవాలంటే గౌతమ్ గంభీర్ కోచింగ్‌లోని భారత జట్టుకు ఈ సిరీస్ అత్యంత కీలకంగా మారింది. ప్రస్తుతం డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ 5వ స్థానంలో కొట్టుమిట్టాడుతోంది. పాయింట్ల పట్టికలో అగ్రస్థానాల్లో ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా జట్లు కొనసాగుతున్నాయి.

9 మ్యాచ్‌ల్లో 7 విజయాలు తప్పనిసరి

భారత్ ఖాతాలో ప్రస్తుతం మరో 9 టెస్టు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇందులో శ్రీలంకతో లంకలో 2 టెస్టులు, న్యూజిలాండ్‌తో వారి స్వదేశంలో 2 టెస్టులు, స్వదేశంలో ఆస్ట్రేలియాతో 5 టెస్టుల బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఉన్నాయి. టీమిండియా వరుసగా మూడోసారి డబ్ల్యూటీసీ ఫైనల్‌కు అర్హత సాధించాలంటే ఈ 9 మ్యాచ్‌ల్లో కనీసం 7 లేదా 8 మ్యాచ్‌ల్లో ఖచ్చితంగా విజయం సాధించాల్సి ఉంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మిగిలిన మూడు సిరీస్‌లలో భారత్ ఏ ఒక్కదాన్నీ కూడా తేలికగా తీసుకునే అవకాశమే లేదు.

గౌతమ్ గంభీర్‌పై ప్రశ్నల వర్షం

హెడ్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత గౌతమ్ గంభీర్ నేతృత్వంలో భారత్ సొంతగడ్డపై న్యూజిలాండ్ చేతిలో, ఆ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా చేతుల్లో వరుసగా సిరీస్‌లను కోల్పోయింది. ఈ వైఫల్యాలపై మాజీ భారత క్రికెటర్ దీప్ దాస్‌గుప్తా స్పందిస్తూ గంభీర్ తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని చెప్పారు. “జట్టు వరుసగా ఓడిపోతున్నప్పుడు కోచ్, కెప్టెన్లను ప్రశ్నించడం సహజం. న్యూజిలాండ్ సిరీస్ నుంచి జట్టులో మార్పులు మొదలయ్యాయి. కానీ టీమిండియా ఏ దిశగా పయనిస్తోందో నాకైతే ఏమాత్రం అర్థం కావడం లేదు. ఖచ్చితంగా గంభీర్, గిల్‌లపై తీవ్ర ఒత్తిడి ఉంటుంది” అని దాస్‌గుప్తా స్పష్టం చేశారు.

ఏ సిరీస్‌నూ తేలికగా తీసుకోలేం

ట్రాన్సిషన్ దశలో ఉన్న ప్రస్తుత భారత జట్టుకు ఏ ఒక్క టెస్టు మ్యాచ్ కూడా సులభం కాదని దీప్ దాస్‌గుప్తా హెచ్చరించారు. “ముఖ్యంగా శ్రీలంకలో ఆడటం అంత తేలికైన విషయం కాదు. గత చరిత్ర చూస్తే అక్కడ స్పిన్ కండిషన్స్ భారత్‌కు ఎప్పుడూ కష్టంగానే మారాయి. ఆ తర్వాత న్యూజిలాండ్ పర్యటన, ఆస్ట్రేలియా సిరీస్ ఉన్నాయి. స్వదేశంలో న్యూజిలాండ్, సౌతాఫ్రికా చేతిలో ఓడిపోయిన అనుభవం ఉంది కాబట్టి, ఏ ప్రత్యర్థినీ తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు” అని వివరించారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *