Headlines

ఆఫీస్ క్యాంటీన్ టీకి గుడ్‌బై.. ఇంటి రుచిని ఇచ్చే టీ మసాలా ఇదిగో! | Homemade Tea Masala Recipe: Enjoy the Authentic Taste of Masala Chai Anywhere


ఆఫీసులో పని ఒత్తిడిలో ఉన్నప్పుడు లేదా ప్రయాణాల్లో ఉన్నప్పుడు ఇంటి శైలిలో ఘుమఘుమలాడే మసాలా టీ తాగాలని ప్రతీ టీ ప్రియుడూ కోరుకుంటారు. కానీ, ఇంట్లో తయారుచేసిన టీ రుచి దుకాణాలలో లేదా ఆఫీస్ క్యాంటీన్లలో అంత సులభంగా లభించదు. కొన్నిసార్లు, ఆ టీ రుచి ఎంత దారుణంగా ఉంటుందంటే అది మీకు సేదతీర్చకపోగా, మీ మూడ్‌ను పాడుచేయగలదు. కాబట్టి, మీరు టీ ప్రియులైతే, లేదా ఒక కప్పు మంచి టీ మీ మనసుకు ఉత్సాహాన్ని, ఉల్లాసాన్ని అందించే ఈ చాయ్ మసాలా రెసిపీ మీ కోసమే.

కావలసిన పదార్థాలు:

యాలకులు: 25 గ్రాములు

లవంగాలు: 10-12 గ్రాములు

ఇవి కూడా చదవండి



దాల్చినచెక్క: 3-4 చిన్న ముక్కలు

మిరియాలు: 1 టేబుల్ స్పూన్

సోంపు: 1 టేబుల్ స్పూన్

సొంటి పొడి (ఎండిన అల్లం పొడి): 2 టేబుల్ స్పూన్లు

జాపత్రి / జాజికాయ ముక్క: చాలా చిన్నది (తగినంత)

తయారుచేసే విధానం:

స్టౌవ్‌పై మందపాటి బాండి పెట్టుకుని తక్కువ మంటపై ఉంచి యాలకులు, లవంగాలు, దాల్చినచెక్క, మిరియాలు, సోంపులను వేయించాలి. సువాసన వచ్చే వరకు 2-3 నిమిషాలు దోరగా వేయించి, చల్లారనివ్వాలి.
ఇలా వేయించిన సుగంధ ద్రవ్యాలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్‌లో వేసి, అందులో సొంటి పొడి, జాజికాయ ముక్కను కలిపి మరింత మెత్తటి పొడిగా రుబ్బుకోవాలి. ఈ మసాలా పొడిని గాలి చొరబడని గాజు సీసాలో భద్రపరుచుకోవాలి.

ఉపయోగించే విధానం, చిట్కాలు:

ఒక కప్పు టీ తయారుచేసేటప్పుడు, నీళ్లు, టీ పొడి మరుగుతున్న సమయంలో కేవలం పావు టీస్పూన్ సుమారుగా ఒక చిటికెడు ఈ మసాలా పొడిని వేస్తే సరిపోతుంది. ఆఫీసుకు వెళ్లేటప్పుడు లేదా ప్రయాణాలకు వెళ్లేటప్పుడు ఈ మసాలా పొడిని చిన్న డబ్బాలో వెంట తీసుకెళ్లవచ్చు. వేడి టీ లేదా వేడి పాలలో ఈ పొడిని కలుపుకుని తాగవచ్చు.

ఆరోగ్య ప్రయోజనాలు:

ఈ టీ మసాలా కేవలం రుచినే కాకుండా అనేక ఆరోగ్య ప్రయోజనాలను ఇస్తుంది. ఇందులో ఉపయోగించిన సొంటి, మిరియాలు జలుబు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తాయి. యాలకులు, సోంపు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజువారీ ఒత్తిడిని తగ్గించి, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో ఈ మసాలా టీ ఎంతగానో తోడ్పడుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *