Headlines

Reba Monica John: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ‘రెబా మోనికా’ కూతురి ఫొటోస్ ఇదిగో | Actress Reba Monica John and Her Husband Joemon Joseph Welcomed A Baby Girl, See Photos

Reba Monica John: పండంటి బిడ్డకు జన్మనిచ్చిన టాలీవుడ్ హీరోయిన్.. ‘రెబా మోనికా’ కూతురి ఫొటోస్ ఇదిగో | Actress Reba Monica John and Her Husband Joemon Joseph Welcomed A Baby Girl, See Photos


హీరోయిన్ రెబా మోనికా జాన్ శుభవార్త చెప్పింది. ‘సామజవరగమన’ తో పాటు పలు తెలుగు హిట్ సినిమాల్లో నటించిన ఆమె తల్లిగా ప్రమోషన్ పొందింది. తాజాగా ఆమె పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ శుభవార్తను ఆమెనే సోషల్ మీడియా వేదికగా అందరితో పంచుకుంది. రెబా మోనికా తన భర్తతో పాటు కూతురు ఫేస్ కనిపించకుండా దిగిన ఫోటోని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేస్తూ.. ‘జులై 22 సాయంత్రం 4 గంటల 15 నిమిషాలకు నాకు కూతురు పుట్టింది పుట్టింది. తన పేరు కియారా జోసెఫ్’ అని పేర్కొందీ అందాల తార. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు, నెటిజన్లు రెబా మోనికా జాన్ కి అభినందనలు, శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కాగా రెబా మోనికా జాన్, జోమన్ జోసెఫ్ లది ప్రేమ వివాహం. 2022లో వీరు పెద్దల సమక్షంలో పెళ్లి పీటలెక్కారు.  భర్త జోమాన్ జోసెఫ్  ఒక ఎమ్మెన్సీ కంపెనీలో కన్సల్టెంట్ గా పని చేస్తున్నాడు. అలాగే కొన్ని వ్యాపారాలు కూడా ఉన్నాయి.

బెంగళూరుకు చెందిన రెబా మోనికా 2016లో జకబింటే స్వర్గరాజ్యం అనే ఒక మలయాళం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత ఎక్కువగా తమిళ్ సినిమాల్లోనే నటించింది. ఫోరెన్సిక్, జరుగండి, బిగిల్, మైఖేల్, ఎఫ్.ఐ.ఆర్, బూ తదితర హిట్ సినిమాల్లో రెబా కీలక పాత్రలు పోషించింది.  ఓ వైపు హీరోయిన్ గా నటిస్తూనే, మరోవైపు బిగిల్ వంటి సినిమాల్లో స్పెషల్ రోల్స్ తో ఆడియెన్స్ ను ఆకట్టుకుందీ అందాల తార. ఇక శ్రీవిష్ణు హీరోగా నటించిన సామజవరగమన సినిమాతో తెలుగు ఆడియెన్స్ ను పలకరించింది రెబా. ఇందులో ఆమె అందం, అభినయానికి మంచి మార్కులే పడ్డాయి. ఇక మ్యాడ్ స్క్వేర్ సినిమాలో రెబా చేసిన స్వాతి రెడ్డి సాంగ్ అయితే చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఈ సాంగ్ లో ఆమె  వేసిన స్టెప్పులకు యూట్యూబ్ షేక్ అయ్యింది. ఇక చివరిగా శ్రీ విష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్ సినిమాలో కనిపించింది రెబా. ఇందులో ఆమె పవర్ ఫుల్ పోలీసాఫీసర్ పాత్రలో యాక్ట్ చేసింది.

ఇవి కూడా చదవండి



 భర్త, కూతురితో రెబా మోనికా జాన్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *