Headlines

ఎక్స్‌టెన్షన్ బోర్డు వాడితే కరెంట్ బిల్లు పెరుగుతుందా? అసలు నిజం ఏంటో తెలుసుకోండి.. | Does an Extension Board Increase Electricity Bill, Facts and Myths Revealed

ఎక్స్‌టెన్షన్ బోర్డు వాడితే కరెంట్ బిల్లు పెరుగుతుందా? అసలు నిజం ఏంటో తెలుసుకోండి.. | Does an Extension Board Increase Electricity Bill, Facts and Myths Revealed


ఒకేసారి ఎక్కువ ఎలక్ట్రానిక్ పరికరాలను కనెక్ట్ చేయడానికి చాలా ఇళ్లలో ఎక్స్‌టెన్షన్ బోర్డులను ఉపయోగిస్తుంటారు. అయితే ఎక్స్‌టెన్షన్ బోర్డులను వాడటం వల్ల విద్యుత్ వినియోగం పెరిగి, కరెంట్ బిల్లు ఎక్కువ వస్తుందనే డౌట్ చాలామందిలో ఉంది. అసలు ఎక్స్‌టెన్షన్ బోర్డ్ ఎంత కరెంట్‌ను వినియోగిస్తుంది? దీనివల్ల కరెంట్ బిల్లు పెరుగుతుందా? అనే విషయాలపై నిజానిజాలు తెలుసుకోవడం ముఖ్యం. ఎక్స్‌టెన్షన్ కోర్డ్ సొంతంగా విద్యుత్‌ను వినియోగించుకోదు. ఇందులో కేవలం వైర్లు మాత్రమే ఉంటాయి. ఇవి గోడపై ఉన్న మెయిన్ సాకెట్ నుంచి మీరు కనెక్ట్ చేసిన టీవీ, ఛార్జర్ లేదా ఇతర పరికరాలకు కరెంట్‌ను సరఫరా చేయడానికి మాత్రమే పనిచేస్తాయి.

బిల్లు పెరుగుతుందా?

టీవీ లేదా ఇతర పరికరాలను నేరుగా మెయిన్ సాకెట్‌కు ప్లగ్ చేసినా లేదా ఎక్స్‌టెన్షన్ బోర్డ్‌ ద్వారా వాడినా విద్యుత్ వినియోగం దాదాపు ఒకేలా ఉంటుంది. ఒకవేళ ఎక్స్‌టెన్షన్ బోర్డ్ కేబుల్ చాలా పొడవుగా ఉంటే, స్వల్పంగా విద్యుత్ నష్టం జరిగే అవకాశం ఉంటుంది. అయితే ఇది ఏడాది మొత్తంలో మీ కరెంట్ బిల్లుపై కేవలం కొద్ది రూపాయల ప్రభావం మాత్రమే చూపుతుంది. కాబట్టి దీనివల్ల కరెంట్ బిల్లు గణనీయంగా పెరుగుతుందనడంలో నిజం లేదు.

చౌకబారు కేబుల్స్‌తో ప్రమాదం

  • ఎక్స్‌టెన్షన్ కోర్డ్‌ను ఉపయోగిస్తున్నప్పుడు వైర్ మందం సరిగ్గా ఉందో లేదో చూసుకోవడం చాలా ముఖ్యం.
  • సన్నని వైర్లు ఉన్న ఎక్స్‌టెన్షన్ బోర్డులు ఎక్కువ విద్యుత్ లోడ్‌ను తట్టుకోలేవు.
  • వాడే సమయంలో ఎక్స్‌టెన్షన్ బోర్డ్ వైర్ వేడెక్కుతున్నట్లు అనిపిస్తే, అది సురక్షితం కాదని అర్థం.
  • వేడెక్కిన వైర్ల వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగి నిప్పు రవ్వలు రావడం లేదా నిప్పంటుకునే ప్రమాదం కూడా ఉంది.

ఏది బెస్ట్?

నాణ్యమైన, మందపాటి కేబుల్స్ ఉన్న ఎక్స్‌టెన్షన్ కోర్డ్‌లను మాత్రమే కొనుగోలు చేయడం సురక్షితమైన పద్ధతి. ఎక్స్‌టెన్షన్ బోర్డ్ కేవలం ఒక పాయింట్ నుంచి మరొక పాయింట్‌కి విద్యుత్‌ను చేరవేసే సాధనం మాత్రమే కాబట్టి అది మీ కరెంట్ బిల్లును పెంచదు. కాబట్టి భయం లేకుండా, నాణ్యమైన బోర్డులను ఎంచుకుని సురక్షితంగా ఉపయోగించవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *