Headlines

ఒక ఎకరానికి ఎన్ని గుంటలు.. ఎన్ని సెంట్లు.. ఎన్ని గజాలు? ఈ భూమి లెక్కలు తెలుసుకోండి.. | Land Measurement Guide: How Many Guntas and Cents Make One Acre in Andhra Pradesh and Telangana

ఒక ఎకరానికి ఎన్ని గుంటలు.. ఎన్ని సెంట్లు.. ఎన్ని గజాలు? ఈ భూమి లెక్కలు తెలుసుకోండి.. | Land Measurement Guide: How Many Guntas and Cents Make One Acre in Andhra Pradesh and Telangana


తెలుగు రాష్ట్రాల్లో స్థలాలు, వ్యవసాయ భూములు లేదా ఓపెన్ ప్లాట్లు కొనుగోలు చేసేటప్పుడు కొలతలపై పూర్తి అవగాహన ఉండటం అత్యంత ముఖ్యం. ఒక్కో ప్రాంతంలో ఒక్కో రకమైన కొలత పద్ధతి వాడుకలో ఉంటుంది. తెలంగాణలో ఎక్కువగా గుంటలు అని పిలిస్తే, ఆంధ్రప్రదేశ్‌లో సెంట్లు అని అంటారు. పట్టణాల్లో మాత్రం చదరపు గజాలు, చదరపు అడుగులు లెక్కలు ఎక్కువగా వినబడుతుంటాయి. అయితే అసలు ఒక ఎకరానికి ఎన్ని గుంటలు ఉంటాయి? ఎన్ని సెంట్లు ఉంటాయి? చదరపు అడుగుల్లో దాని వైశాల్యం ఎంత? అనే విషయాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం.

ఎకరం

ప్రపంచవ్యాప్తంగానే కాకుండా భారత్‌లో కూడా భూ వైశాల్యాన్ని కొలవడానికి ఎకరంను ప్రామాణికంగా ఉపయోగిస్తారు.

  • 1 ఎకరం – 43,560 చదరపు అడుగులు
  • 1 ఎకరం – 4,840 చదరపు గజాలు

తెలంగాణలో గుంటల లెక్కలు

తెలంగాణలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల భూమి రికార్డుల్లో ప్రధానంగా ఎకరాలు – గుంటల లెక్కల్లోనే భూమి వివరాలు ఉంటాయి.

  • 1 ఎకరం – 40 గుంటలు
  • 1 గుంట – 1,089 చదరపు అడుగులు
  • 1 గుంట = 121 చదరపు గజాలు

ఉదాహరణకు: మీరు 5 కుంటల భూమిని కొనుగోలు చేస్తున్నట్లయితే.. అది 5 × 121 = 605 చదరపు గజాలు అవుతుంది.

ఆంధ్రప్రదేశ్‌లో సెంట్ లెక్కలు

ఏపీలో రెవెన్యూ రికార్డులు, భూముల రిజిస్ట్రేషన్ల సమయంలో సెంట్లు లెక్కలు ఎక్కువగా వినిపిస్తాయి.

  • 1 ఎకరం – 100 సెంట్లు
  • 1 సెంట్ – 435.6 చదరపు అడుగులు
  • 1 సెంట్ – 48.4 చదరపు గజాలు

ఉదాహరణకు: 10 సెంట్ల స్థలం అంటే 484 చదరపు గజాల వైశాల్యం అని అర్థం.

గుంటలకు, సెంట్లకు ఉన్న తేడా ఏంటి?

చాలామంది గుంటను, సెంట్‌ను ఒకటే అనుకుని పొరబడుతుంటారు. కానీ గుంట అనేది సెంట్ కంటే చాలా పెద్దది.

1గుంట – 2.5 సెంట్లు (సుమారుగా)

అంటే తెలంగాణలో గుంట స్థలం అనేది ఆంధ్రప్రదేశ్‌లోని 2.5 సెంట్లకు (121 గజాలు) సమానమవుతుంది.

హెక్టార్ అంటే ఎంత?

ప్రభుత్వ పెద్ద ప్రాజెక్టులు, అటవీ శాఖ లెక్కలు లేదా ఆఫీషియల్ రికార్డుల్లో హెక్టార్లు అనే పదాన్ని వాడతారు.

  • 1 హెక్టార్ – 2.47 ఎకరాలు
  • 1 హెక్టార్ – గుంటలు కుంటలు
  • 1 హెక్టార్ – 1,07,639 చదరపు అడుగులు

 గుర్తించుకోవాల్సిన విషయాలు

రియల్ ఎస్టేట్ ప్లాట్లు లేదా వ్యవసాయ భూమి కొనేముందు కేవలం డాక్యుమెంట్లలో ఉన్న ఎకరాలు లేదా గుంటల సంఖ్యనే కాకుండా మొత్తం చదరపు గజాలు లేదా చదరపు అడుగులు లెక్కగట్టి ధరను బేరీజు వేసుకోవడం మంచిది. దీనివల్ల ఏమైనా వ్యత్యాసాలు ఉన్నా సులభంగా గుర్తించవచ్చు.  అంతేకాకుండా డాక్యుమెంట్లలో ఉన్న గుంటలు, సెంట్లు, క్షేత్రస్థాయిలో ఉన్న సరిహద్దులకు సరిపోలుతున్నాయో లేదో సరిచూసుకోవడం మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *