Headlines

ఓవర్సీస్‌ జాబ్‌ Scam.. భారీ జీతాల పేరుతో యువతకు టోకరా! నిరుద్యోగులే టార్గెట్ | Overseas Job Fraud Cases Rise; Andhra Pradesh Tops Complaint List with 1495 Cases

ఓవర్సీస్‌ జాబ్‌ Scam.. భారీ జీతాల పేరుతో యువతకు టోకరా! నిరుద్యోగులే టార్గెట్ | Overseas Job Fraud Cases Rise; Andhra Pradesh Tops Complaint List with 1495 Cases


విజయవాడ, ఆగస్ట్ 5: విదేశాల్లో మంచి జీతంతో ఉద్యోగం పొందడం చాలా మంది తెలుగు కుటుంబాల కలగా మారింది. మెరుగైన భవిష్యత్తు కోసం ప్రతి ఏడాది ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల నుంచి వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగార్థులు విదేశాలకు వెళ్తున్నారు. విదేశాల్లో ఉద్యోగ అవకాశాల కోసం కొంతమంది గుర్తింపు పొందిన ఓవర్సీస్ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీలను ఆశ్రయిస్తుండగా, మరికొందరు అనధికారిక ఏజెంట్లను నమ్ముతున్నారు. ఈ ఏజెంట్లు భారీ జీతాలు, మంచి ఉద్యోగాల పేరుతో ఆకర్షించి, పలువురిని మోసం చేస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. అనేక సందర్భాల్లో రిజిస్ట్రేషన్ లేని ఏజెంట్లు నకిలీ ఉద్యోగ ఆఫర్లు చూపించి అభ్యర్థుల నుంచి భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. చివరకు ఉద్యోగం రాకపోవడంతో బాధితులు విదేశాలకు వెళ్లలేక, కొందరు అక్కడికి వెళ్లిన తర్వాత ఇబ్బందుల్లో చిక్కుకుంటున్నారు.

విదేశీ ఉద్యోగ మోసాల్లో ఏపీ టాప్

కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) గణాంకాల ప్రకారం, విదేశీ ఉద్యోగ నియామక మోసాలకు సంబంధించి అత్యధిక ఫిర్యాదులు నమోదైన రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ మొదటి స్థానంలో నిలిచింది. ధ్రప్రదేశ్‌ 1,495 ఫిర్యాదులు వచ్చాయి. కేరళ రెండో స్థానం, తమిళనాడు మూడో స్థానం, తెలంగాణ 339 ఫిర్యాదులతో నాలుగో స్థానం ఉంది. విదేశీ ఉద్యోగాల కోసం ప్రయత్నించే అభ్యర్థులు గుర్తింపు పొందిన రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి



ఉద్యోగం ఇప్పిస్తామని చెప్పే వ్యక్తుల వివరాలను ముందుగా పరిశీలించాలి. అలాగే పాస్‌పోర్ట్, వీసా, ఉద్యోగ ఒప్పందం వంటి ముఖ్యమైన పత్రాలను పూర్తిగా పరిశీలించకుండా ఎలాంటి చెల్లింపులు చేయకూడదని అధికారులు హెచ్చరిస్తున్నారు. విదేశాల్లో ఉద్యోగాలపై పెరుగుతున్న ఆసక్తిని మోసగాళ్లు అవకాశంగా మార్చుకుంటున్న నేపథ్యంలో యువత అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ఈ సంఘటనలు చెబుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *