తరువాత 2 స్పూన్ల ఉల్లిపాయ తొక్కల పొడిని తీసుకోండి. ఇందులో సల్ఫర్, ఐరన్, జింక్ మరియు నైట్రోజన్ ఉంటాయి. సల్ఫర్ ఘాటు వల్ల మట్టిలో హానికరమైన పురుగులు రావు.
1 స్పూన్ గుడ్డు పెంకుల పొడి తీసుకోండి. కడిగి ఎండబెట్టిన కోడిగుడ్డు పెంకుల పొడిలో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఇది మొక్క కణాల నిర్మాణాన్ని, కొత్త చిగుళ్లను బలోపేతం చేస్తుంది. ఈ మూడింటిని కలిపి 12 నుండి 14 అంగుళాల కుండీలో మొక్క చుట్టూ మట్టిపై చల్లి, మట్టితో కలిపి తగినంత నీరు పోయాలి. ప్రతి 20 రోజులకు ఒకసారి ఈ ఎరువును ఇస్తే కనకాంబరం మొక్క పూల గుత్తులతో కళకళలాడుతుంది!