Headlines

కార్లు, బైక్‌లను మర్చిపోండి.. ఇదిగో ఇనుప గుర్రం వచ్చేసింది.. అదరగొడుతున్న సైబర్ హార్స్‌.. | Forget Cars and Bikes! China’s Futuristic Cyber Horse Steals the Show at World Robot Conference 2026


సాంకేతిక ప్రపంచంలో రోబోటిక్స్ రంగం శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. చైనా రాజధాని బీజింగ్‌లో వైభవంగా నిర్వహించిన వరల్డ్ రోబోట్ కాన్ఫరెన్స్ 2026 ప్రపంచ రంగాన్ని విశేషంగా ఆకట్టుకుంది. భవిష్యత్తు మానవ జీవితాన్ని సాంకేతికత ఏ విధంగా మార్చబోతోందో తెలియజేసే పలు వినూత్న ఆవిష్కరణలను ఈ ప్రదర్శనలో ఆవిష్కరించారు.

బీజింగ్‌లో జరిగిన 2026 వరల్డ్ రోబోట్ కాన్ఫరెన్స్, వరల్డ్ హ్యూమనాయిడ్ రోబోట్ గేమ్స్‌లో చైనా టెక్ కంపెనీలు ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచాయి. సైబర్‌హార్స్‌లు, లేదా రోబోటిక్ గుర్రాలు చర్చనీయాంశంగా మారగా, మనుషులను పోలిన హ్యూమనాయిడ్ రోబోట్లు మైదానంలో అథ్లెట్ ఉసేన్ బోల్ట్ రికార్డును బద్దలు కొట్టాయి.

ఈ ప్రదర్శనలో అందరి దృష్టినీ ఆకర్షించింది సైబర్ హార్స్. అత్యాధునిక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI), మెకానికల్ ఇంజనీరింగ్‌తో రూపొందించిన ఈ రోబోటిక్ గుర్రం కఠినమైన భూభాగాల్లో కూడా సులభంగా నడవగలదు. రవాణా, పరిశోధనలు, రక్షణ రంగం, విపత్తు నిర్వహణ సమయాల్లో మనుషులు వెళ్లలేని ప్రాంతాలకు వెళ్లి సహాయక చర్యలు చేపట్టడానికి ఈ సైబర్ గుర్రం ఎంతో ఉపయోగపడుతుందని నిపుణులు తెలిపారు.

సైబర్ హార్స్‌తో పాటు హ్యూమనాయిడ్ రోబోలు ఈ కాన్ఫరెన్స్‌లో ప్రత్యేక సెంట్రాఫ్ అట్రాక్షన్‌గా నిలిచాయి. మనుషుల తరహాలోనే కదలికలు, హావభావాలు, సంభాషణలు సాగించేలా వీటిని తీర్చిదిద్దారు. కర్మాగారాల్లో ప్రమాదకర పనులు చేయడం, వస్తువులను అసెంబుల్ చేయడం, గృహ అవసరాల్లో సహాయపడటం వంటి సంక్లిష్టమైన బాధ్యతలను ఇవి సులువుగా నిర్వహించగలవు. ఆసుపత్రుల్లో రోగుల సంరక్షణ, వృద్ధులకు సహాయం అందించడంలో ఇవి కీలక పాత్ర పోషించనున్నాయి.

వీడియో ఇక్కడ చూడండి..

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సెన్సార్ టెక్నాలజీ కలయికతో ఈ రోబోలు అత్యంత వేగంగా స్పందించే సామర్థ్యాన్ని సాధించాయి. రాబోయే రోజుల్లో తయారీ రంగం, లాజిస్టిక్స్, హెల్త్‌కేర్ విభాగాలలో రోబోల పాత్ర మరింత విస్తృతం కానుందని ఈ సదస్సు స్పష్టం చేసింది. ఈ కాన్ఫరెన్స్ ద్వారా లభించిన సాంకేతిక పురోగతి, మానవ శ్రమను తగ్గించడమే కాకుండా ఉత్పత్తి సామర్థ్యాన్ని ఊహించని రీతిలో పెంచుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. సాంకేతిక ప్రియులకు ఈ ప్రదర్శన ఒక అద్భుతమైన దృశ్యకావ్యంగా నిలిచింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *