Headlines

గుడిమెట్లమీద కూర్చున్న స్టార్ హీరో.. బిచ్చగాడు అనుకోని రూ. 10 వేసిన మహిళ.. ఆయన ఏం చేశాడంటే | A woman once gave Superstar Rajinikanth ten rupees, mistaking him for a beggar


భారతీయ సినిమా చరిత్రలో సూపర్ స్టార్ రజినీకాంత్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఆయన తెరపై కనబరిచే స్టార్‌డమ్ ఎంతటిదో, నిజ జీవితంలో ఆయన సింప్లిసిటీ అంతటిది. సూపర్ స్టార్ గా ఇండస్ట్రీని ఏలుతున్న రజినీకాంత్. నిజజీవితంలో మాత్రం చాలా సామాన్య జీవితం జీవిస్తుంటారు. తరచుగా హిమాలయాలకు వెళ్లడం, ఆలయాలను సందర్శించడం ఆయనకు అలవాటు. అలాంటి ఒక సందర్భంలో జరిగిన సంఘటన, రజినీకాంత్ వ్యక్తిత్వాన్ని మరింత ఉన్నతంగా నిలబెట్టింది. ఆయన బ్లాక్‌బస్టర్ చిత్రం శివాజీ భారీ విజయం సాధించిన తర్వాత, రజినీకాంత్ హిమాలయాల్లోని ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలని నిర్ణయించుకున్నారు. అయితే, ఒక సాధారణ భక్తుడిగా వెళ్లాలని భావించారు. తనతో పాటు బౌన్సర్లు, సెక్యూరిటీని వద్దని స్పష్టంగా చెప్పారట. తెల్లటి పంచె, చొక్కా ధరించి, గడ్డంతో సాధారణ మనిషిలాగా ఒంటరిగా ఆలయానికి వెళ్లారు. దేవుడి దర్శనం చేసుకున్న తర్వాత, ఆలయం బయట మెట్లపై కాసేపు కూర్చున్నారు. దేవుడిని స్మరించుకుంటున్నారట..

ఇది కూడా చదవండి :

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు

అదే సమయంలో, అక్కడికి ఒక వృద్ధురాలు వచ్చారు. మెట్లపై కూర్చున్న వ్యక్తి సూపర్ స్టార్ రజినీకాంత్ అని ఆమెకు తెలియదు. ఆయన సాధారణ అవతారం, గడ్డం చూసి, ఎవరో పేదవాడు లేదా బిచ్చగాడు అనుకున్నారట. జాలి, దయతో తన దగ్గరున్న పది రూపాయల నోటును తీసి రజినీకాంత్ చేతిలో పెట్టార ఆ పెద్దావిడ. ఈ అనూహ్య సంఘటనకు రజినీకాంత్ ఏ మాత్రం కోపగించుకోలేదట. ఎలాంటి అసహనం చూపించకుండా, ఆ వృద్ధురాలు ఇచ్చిన పది రూపాయలను చిరునవ్వుతో, ఎంతో ప్రేమగా రెండు చేతులతో స్వీకరించార రజిని. ఆ తర్వాత, రజినీకాంత్ మెట్లపై నుండి లేచి తన కారు వైపు నడిచారట. ఆలయం బయట ఆయన కోసం ఎదురుచూస్తున్న ఖరీదైన లగ్జరీ కారు, దాని పక్కన నిలబడిన భద్రతా సిబ్బందిని, అభిమానుల గుంపును చూసి ఆ వృద్ధురాలు ఒక్కసారిగా షాక్ అయ్యారట. తాను బిచ్చగాడు అనుకుని భిక్షమిచ్చింది భారతీయ సినీ లోకాన్ని ఏలే సూపర్ స్టార్ రజినీకాంత్‌కే అని ఆమెకు అప్పుడు అర్థమైందట. వెంటనే ఆమె రజినీకాంత్ దగ్గరకు పరుగెత్తుకు వెళ్లి, “నన్ను క్షమించండి, నన్ను క్షమించండి, మీరు ఎవరో నాకు నిజంగా తెలియదు” అని వేడుకున్నారట.

ఇది కూడా చదవండి :

Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్

ఆ వృద్ధురాలి మాటలకు రజినీకాంత్ చలించిపోయారట. ఆమెతో, “అమ్మా, మీరు నన్ను క్షమించమని అడగకండి. నిజానికి ఇది దేవుడే నాకు గుర్తు చేస్తున్న ఒక అద్భుతమైన పాఠం. నా అసలు స్వరూపం ఏంటో దేవుడు మీ ద్వారా నాకు తెలియజేశాడు. దేవుడి ముందు మనమందరం బిచ్చగాళ్లమే. ఆయన దర్బార్‌లో మన యోగ్యత, అంతస్తు, డబ్బు దేనికి విలువ లేదు. అందరూ ఒక్కటే” అని ప్రవచించారు. ఆయన ఇంకా మాట్లాడుతూ, “నాకు ఎలాంటి అహంకారం, గర్వం రాకుండా ఆపడానికే దేవుడు మీ ద్వారా నాకు సందేశం ఇచ్చారు. మీరు ఇచ్చిన ఈ పది రూపాయలు నాకు కేవలం డబ్బు కాదు, ఇది సాక్షాత్తు భగవంతుడు ఇచ్చిన ఆశీర్వాదం” అని చెప్పారట. ఆ వృద్ధురాలు ఇచ్చిన పది రూపాయల నోటును చివరి వరకు తన దగ్గరే భద్రపరచుకుంటానని అన్నారట సూపర్ స్టార్ రజినీకాంత్.

ఇది కూడా చదవండి :

బాప్రే బాప్..! ఇదెక్కడి సిరీస్ రా మావ.. మెంటలెక్కిస్తుంది..!! ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *