Life Insurance: టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీ తీసుకునేటప్పుడు ప్రతి వ్యక్తి తన కుటుంబ ఆర్థిక భద్రత కోసం సాధారణంగా తన భార్య లేదా భర్త అయిన ఒక సభ్యుడిని ‘నామినీ’గా నియమిస్తాడు. పాలసీదారు మరణించిన తర్వాత హామీ మొత్తాన్ని స్వీకరించడానికి చట్టపరమైన హక్కు ఉన్న వ్యక్తే నామినీ. ఇలాంటి పరిస్థితిలో ఒక దురదృష్టకరమైన రోడ్డు ప్రమాదంలో పాలసీదారు, నామినీ ఇద్దరూ ఒకేసారి లేదా స్వల్ప వ్యవధిలో మరణిస్తే అప్పుడు బీమా డబ్బు ఎవరికి దక్కుతుందని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? అటువంటి పరిస్థితిలో క్లెయిమ్ ప్రక్రియ కొంచెం సంక్లిష్టంగా మారుతుంది. కానీ బీమా చట్టంలో దీని కోసం స్పష్టమైన నియమాలు రూపొందించారు.
పాలసీదారుడు, ప్రాథమిక నామినీ (భార్య వంటివారు) ఇద్దరూ మరణించినప్పుడు బీమా కంపెనీ డబ్బు నేరుగా ఎవరి ఖాతాకు బదిలీ చేయదు. అటువంటి పరిస్థితిలో బీమా క్లెయిమ్ ‘చట్టబద్ధమైన వారసుకి అందిస్తారు. పాలసీ తీసుకునేటప్పుడు బీమా చేయించుకున్న వ్యక్తి మరొకరి లేదా బ్యాకప్ నామినీ (సెకండరీ/ఆల్టర్నేట్ నామినీ) పేరును కూడా నమోదు చేసి ఉంటే అప్పుడు మొదటి హక్కు వారికే చెందుతుంది. ఉదాహరణకు భార్యతో పాటు పిల్లలను సెకండరీ నామినీలుగా చేస్తే క్లెయిమ్ డబ్బు పిల్లలకు చెందుతుంది.
ఇది కూడా చదవండి: మొక్క జొన్న ఉడకబెట్టి తినడం మంచిదా? కాల్చి తినడం మంచిదా? డాక్టర్లు ఏం చెబుతున్నారు?
ఇవి కూడా చదవండి
పాలసీలో ద్వితీయ నామినీ నమోదు కానట్లయితే భారతదేశ హిందూ వారసత్వ చట్టం (లేదా సంబంధిత వ్యక్తిగత చట్టం) ప్రకారం, మరణించిన వ్యక్తి పిల్లలు, తల్లిదండ్రులు మొదలైన ఇతర చట్టబద్ధమైన వారసులు క్లెయిమ్ చేయడానికి అర్హులుగా పరిగణిస్తారు. అయితే ఈ ప్రక్రియలో బీమా కంపెనీ నుండి డబ్బు పొందడానికి, చట్టబద్ధమైన వారసులు కోర్టు నుండి ‘వారసత్వ ధృవీకరణ పత్రం’ లేదా ‘చట్టబద్ధమైన వారసుల ధృవీకరణ పత్రం’ పొందవలసి ఉంటుంది. ఇది కోర్టు నుండి జారీ చేసిన ఒక పత్రం, ఇది మరణించిన వ్యక్తి ఆస్తిపై లేదా బీమా మొత్తంపై ఎవరికి చట్టపరమైన హక్కు ఉందో ధృవీకరిస్తుంది.
కుటుంబంలో మైనర్ పిల్లలు మాత్రమే జీవించి ఉన్నట్లయితే కోర్టు నియమించిన వారి చట్టపరమైన సంరక్షకుడు పిల్లల తరపున క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. బీమా కంపెనీ క్లెయిమ్ మొత్తాన్ని పిల్లల పేరు మీదనే ఉంచుతుంది లేదా సంరక్షకుని ద్వారా పిల్లల ప్రయోజనాల దృష్ట్యా చెల్లింపును ఏర్పాటు చేస్తుంది. ఈ మొత్తం ప్రక్రియలో మరణ ధృవీకరణ పత్రం, ప్రమాదానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ, పోస్ట్మార్టం నివేదిక, కోర్టు వారసత్వానికి సంబంధించిన పత్రాలను సమర్పించడం ఉంటుంది.
ఇది కూడా చదవండి: House Construction: 1000 చదరపు అడుగుల ఇంటి నిర్మాణంలో కేవలం స్లాబ్ ఖర్చు ఎంత అవుతుందో తెలుసా? పూర్తి లెక్కలివే..!
మీ కుటుంబాన్ని ఇటువంటి సమస్యలు, కాగితపు పనుల ఇబ్బందుల నుండి కాపాడటానికి, భీమా నిపుణులు రెండు ముఖ్యమైన చిట్కాలను ఇస్తున్నారు. మొదటిది పాలసీ తీసుకునేటప్పుడు ఎల్లప్పుడూ ఒకటి కంటే ఎక్కువ నామినీలు లేదా ద్వితీయ నామినీ పేరును చేర్చండి. రెండవది వివాహం లేదా పిల్లల జననం తర్వాత మీ పాలసీలోని నామినీ సమాచారాన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం ద్వారా ఏదైనా ఊహించని విపత్తు సంభవించినప్పుడు మీ చట్టబద్ధమైన వారసులు ఎటువంటి కోర్టు విచారణలు లేకుండా సులభంగా భీమా డబ్బును పొందుతారు.
ఇది కూడా చదవండి: Car Driving Tips: ఇది మీకు తెలుసా..? కారును స్టార్ట్ చేసిన తర్వాత డ్రైవ్ చేయడానికి ఎంతసేపు వేచి ఉండాలి?
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి