Headlines

థియేటర్లు అన్నీ దేవాలయాలుగా.. హారతులు, భజనలతో ఊగిపోతున్న ఆడియన్స్ | Fans perform aarti and puja during Irumudi movie ayyappa swamy songs in theater watch video


ఎట్టకేలకు రవితేజ హిట్ కొట్టాడు. చాలా కాలంగా మాస్ రాజా సరైన హిట్స్ లేక సతమతం అవుతున్నాడు. ఈ క్రమంలోనే ఇప్పుడు ఇరుముడి సినిమాతో థియేటర్లోకి వచ్చాడు రవితేజ. ఈ సినిమా భారీ విజయం దిశగా దూసుకుపోతుంది. ప్రీమియర్స్ తోనే ఇరుముడి సినిమా బ్లాక్ బస్టర్ టాక్ సొంతం చేసుకుంది. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ఇరుముడి సినిమా నేడు ( శుక్రవారం) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. విలేజ్ బ్యాక్డ్రాప్ తో పాటు అయ్యప్ప స్వామి మాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు ఆడియన్స్ బ్రహ్మరధం పడుతున్నారు. థియేటర్స్ లో ఈ సినిమా తెగ ఎంజాయ్ చేస్తున్నాడు ప్రేక్షకులు.

ఇది కూడా చదవండి :

శ్రీహరి చనిపోయిన తర్వాత క్లోజ్ ఫ్రెండ్సే సగం ఆస్తులు కాజేశారు.. నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు

సినిమా చూసి అభిమానులు తమ అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు. కాగా సినిమాలోని మల్లెపూల పల్లకి సాంగ్ కు థియేటర్స్ పూనకాలతో ఊగిపోతున్నాయి.. ఆడియన్స్ ఈ పాటకు నెక్స్ట్ లెవల్ లో వైబ్ అవుతున్నారు. డాన్స్ లు చేస్తూ పాటను ఆలపిస్తూ తెగ సందడి చేస్తున్నారు. స్క్రీన్ ముందు డాన్స్ చేస్తూ భజన చేస్తూ సందడి చేస్తున్నారు. అంతే కాదు కొన్ని థియేటర్స్ లో ఆడియన్స్ హారతులు కూడా పడుతున్నారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి :

Madhuri Rathod: అందుకే అలాంటి పాటల్ని సెలక్ట్ చేసుకున్నా.. వాటితోనే క్రేజ్ తెచ్చుకున్నా : మాధురి రాథోడ్

ప్రస్తుతం ఇరుముడి సినిమాకు సంబందించిన వీడియోలు నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోల్లో ఒకదాంట్లో థియేటర్ లోపల స్క్రీన్ కు హారతి ఇస్తున్న వీడియో వైరల్ అవుతుంది. సినిమాలోని మల్లెపూల పల్లకి సాంగ్ ప్లే అవుతుండగా ఓ అభిమాని ఇలా స్క్రీన్ కు హారతి ఇస్తూ కనిపించాడు. ఈ వీడియోను రవితేజ అభిమానులు సోషల్ మీడియాలో తెగ షేర్ చేస్తున్నారు. ఎట్టకేలకీ రవన్న హిట్ కొట్టేశాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్స్.

ఇది కూడా చదవండి :

బాప్రే బాప్..! ఇదెక్కడి సిరీస్ రా మావ.. మెంటలెక్కిస్తుంది..!! ఓటీటీలో ఎక్కడ చూడొచ్చంటే

ఇరుముడి మూవీ..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *