Headlines

నాకు సినిమాలు వద్దు.. మా ఊరు వెళ్లిపోతానని ఆ హీరోయిన్ ఏడ్చింది.. ఇప్పుడు ఆమె ఇండస్ట్రీలో ఓ స్టార్ | G.V. Narayana Rao Intresting comments about Jaya Prada


అంతులేని కథ (1976) చిత్రం విడుదలై ఇన్నేళ్లు అవుతున్న సందర్భంగా, ఆ చిత్రంలో అద్భుతమైన అరంగేట్రం చేసి నంది అవార్డు అందుకున్న నటుడు, నిర్మాత జీవీ నారాయణరావు అప్పటి అరుదైన, గుర్తుండిపోయే అనుభవాలను గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ఆయన మాటల్లో, అంతులేని కథ కేవలం ఒక తెలుగు క్లాసిక్ మాత్రమే కాదు, అది భారతీయ సినిమా చరిత్రలో ఎందరో దిగ్గజాలకు పునాది వేసిన చిత్రం అని అన్నారు. చిత్రీకరణ సమయంలో జరిగిన ఓ సంఘటనను వివరిస్తూ, జీవీ నారాయణరావు జయప్రద ఎదుర్కొన్న భావోద్వేగ క్షణాలను గుర్తుచేసుకున్నారు.

ఆయన లేకపోతే నేను ఇప్పుడు ఇలా ఉండేదాన్ని కాదు.. నన్ను స్టార్ హీరోయిన్‌ను చేశారు

ఒక సన్నివేశంలో ఆమె పాత్రను ఉద్దేశించి “సాని దానిలాగా” అని తిట్టే డైలాగ్ ఉంటుంది. ఈ సంభాషణ విని జయప్రద తీవ్రంగా కలత చెందారని, ఆ రోజు షూటింగ్‌లో విరామం సమయంలో “నేను రాజమండ్రి వెళ్లిపోతాను, నాకు సినిమాలు వద్దు” అంటూ కన్నీళ్లు పెట్టుకున్నారని జీవీ నారాయణరావు తెలిపారు.

మహేష్‌తో ఉన్న ఈ చిన్నోడు.. ఇప్పుడు అమ్మాయిల డ్రీమ్ బాయ్.! రీసెంట్‌గానే హిట్ కొట్టాడు

అప్పటికి ఆమె చిన్నపిల్ల అని, సినిమాల గురించి పెద్దగా అవగాహన లేదని ఆయన వివరించారు. ఆ సమయంలో రజినీకాంత్, జీవీ నారాయణరావు ఆమె పక్కన కూర్చుని ధైర్యం చెప్పి, ఈ సినిమా ఆమె జీవితాన్ని మలుపు తిప్పుతుందని, మంచి పేరు తెస్తుందని నచ్చజెప్పారట. వారి ప్రోత్సాహంతోనే ఆమె తిరిగి ధైర్యంగా ఆ సన్నివేశాన్ని జయప్రద పూర్తి చేశారని తెలిపారు. అలాగే, సూపర్‌స్టార్ రజినీకాంత్ సైతం దర్శకుడు కె. బాలచందర్  కష్టపడిన తీరును జీవీ నారాయణరావు వివరించారు. “దేవుడే ఇచ్చాడు వీధి ఒకటి” అనే పాటకు సంబంధించిన ఒక సన్నివేశం మళ్లీ మళ్లీ చేయాల్సి వచ్చింది.  ఒక దశలో రజినీకాంత్, బాలచందర్ గారి దగ్గరికి వెళ్లి “గురువుగారు, నన్ను క్షమించండి, నేను చెయ్యలేను, వదిలేయండి నన్ను” అని అన్నారని తెలిపారు. అయితే, బాలచందర్ గారు రజినీకాంత్‌ను ప్రోత్సహించి ఆ సన్నివేశం చిత్రీకరించారట. అది రజినీకాంత్ కెరీర్‌కు ఎంతో సహాయపడిందని వివరించారు.

ఇవి కూడా చదవండి



చిరంజీవి ఇష్టమైన బాలయ్య సినిమా ఎదో తెలుసా.? ఇండస్ట్రీని షేక్ చేసిన మూవీ అది

Jaya Prada Pic

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *