Headlines

నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్‌ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం! | Why You Should Consume Turmeric Daily: US Doctor Shares 8 Powerful Health Benefits

నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్.. ప్రతిరోజూ ఒక్క గ్లాస్‌ తాగారంటే.. బంగారంలాటి ఆరోగ్యం! | Why You Should Consume Turmeric Daily: US Doctor Shares 8 Powerful Health Benefits


ఆయుర్వేదంలో లిక్విడ్ గోల్డ్‌గా పిలిచే పసుపు ప్రాధాన్యతను ఇప్పుడు ఆధునిక వైద్య ప్రపంచం కూడా గుర్తిస్తోంది. అమెరికాకు చెందిన ప్రముఖ దేహ సౌష్టవ, దీర్ఘాయువు నిపుణుడు డాక్టర్ జోనాథన్ షోఫ్ రోజువారీ జీవితంలో పసుపును ఎందుకు తీసుకోవాలో 8 ప్రధాన కారణాలను వివరించారు. పసుపులోని గుణాలు వృద్ధాప్య ఛాయలను తగ్గించడమే కాకుండా, క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది. అలాగే లివర్ డిటాక్స్, ఇన్సులిన్ నిరోధకత తగ్గించడం, మెదడు పనితీరు పెంపొందించడం, కీళ్ల నొప్పుల ఉపశమనం వంటి అద్భుత ప్రయోజనాలను అందిస్తుందని ఆయన వెల్లడించారు. పూర్తి ప్రయోజనాలేంటో ఇప్పుడు చూద్దాం..

వృద్ధాప్య ఛాయలను తగ్గిస్తుంది:

పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనం శరీర కణాలను ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుండి రక్షిస్తుంది. ఇది చర్మంపై ముడుతలను తగ్గించి, మెలానిన్ ఉత్పత్తిని నియంత్రించడం ద్వారా వృద్ధాప్య ప్రక్రియను మందగించేలా చేస్తుంది.

క్యాన్సర్ కణాలతో పోరాడుతుంది:

కర్కుమిన్ కణజాల మార్పులను అడ్డుకోవడంలో మరియు క్యాన్సర్ కణాలు పెరగకుండా నిరోధించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది సహజ సిద్ధమైన యాంటీ క్యాన్సర్ ఏజెంట్‌గా పనిచేస్తుంది.

ఇవి కూడా చదవండి



లివర్ డిటాక్స్ :

పసుపు కాలేయానికి అద్భుతమైన డిటాక్సిఫైయర్‌గా పనిచేస్తుంది. ఇది లివర్ ఎంజైమ్‌లను క్రమబద్ధీకరించి, కాలేయంలో పేరుకుపోయే విషపదార్థాలను నివారిస్తుంది.

ఇన్సులిన్ నిరోధకతను తగ్గిస్తుంది:

రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇది గ్లూకోజ్ శోషణను పెంచి, ఇన్సులిన్ పనితీరును మెరుగుపరుస్తుంది.

వాపు, కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం:

పసుపులోని యాంటీఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఆర్థరైటిస్, కీళ్ల నొప్పులను తగ్గిస్తాయి. శరీరంలో అంతర్గతంగా వచ్చే వాపులను తగ్గించి ఉపశమనాన్ని ఇస్తాయి.

మెదడు ఆరోగ్యం – జ్ఞాపకశక్తి పెంపు:

కర్కుమిన్ బ్లడ్-బ్రెయిన్ బారియర్ ను దాటి మెదడులోకి ప్రవేశించగలదు. ఇది BDNF అనే ప్రొటీన్‌ను పెంచి కొత్త మెదడు కణాల పెరుగుదలకు, జ్ఞాపకశక్తి పెంపునకు, డిప్రెషన్ తగ్గడానికి దోహదపడుతుంది.

రోగనిరోధక శక్తి పెంపు, జీర్ణక్రియ మెరుగు:

పసుపులో ఉన్న బాక్టీరియా నిరోధక గుణాలు శరీర రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేస్తాయి. జీర్ణ సంబంధిత సమస్యలను తొలగించి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయి.

నానమ్మల నాటి గోల్డెన్ మిల్క్:

మన నాయనమ్మలు, అమ్మమ్మలు పూర్వం నుంచి ఇస్తున్న పసుపు పాలు లేదా పసుపు టీ అత్యుత్తమ ఔషధమని డాక్టర్ తెలిపారు. గోరువెచ్చని పాలలో చిటికెడు పసుపు, కొద్దిగా మిరియాల పొడి కలిపి తాగడం వల్ల లభించే ఆరోగ్య ప్రయోజనాలు అపారమని నిపుణులు పేర్కొన్నారు.

మానసిక ప్రశాంతత – మంచి నిద్ర:

రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని పసుపు పాలు తాగడం వల్ల ఒత్తిడి, ఆందోళన తగ్గి మనసు ప్రశాంతంగా మారుతుంది. ఇది నిద్రలేమి సమస్యతో బాధపడేవారికి అద్భుతమైన సహజ ఔషధంగా పనిచేస్తుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *