Headlines

నా కులం వాళ్లే కుట్ర చేశారు.. డ్రగ్స్ కేసులో ఇరికిస్తామన్నారు.. షాకింగ్ కామెంట్స్ చేసిన స్టార్ హీరో | Tollywood Actor Jagapathi Babu revealed issue created by some people before his daughter love marriage


సినిమా ఇండస్ట్రీలో ఒకప్పుడు హీరోలుగా నటించిన చాలా మంది ఇప్పుడు సహాయక పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. ఇక ఇప్పుడు కొంతమంది విలన్స్ గానూ నటించి మెప్పిస్తున్నారు. అలాంటి వారిలో జగపతి బాబు ఒకరు. ఇప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నారు. తెలుగు సినిమాలతో పాటు హిందీ, తమిళ్ , కన్నడ సినిమాల్లోనూ నటిస్తున్నారు జగపతిబాబు. ఎలాంటి పాత్ర అయినా యిట్టె ఒదిగిపోయే జగపతి బాబు ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు.  సినీ ఇండస్ట్రీలో నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో జగపతి బాబు ముందు వరసలో ఉంటారు. ఫ్యామిలీ ఆడియన్స్ ల్లో జగపతిబాబుకు సపరేట్ క్రేజ్ ఉంటుంది. ఒకప్పుడు హీరోగా రాణించిన ఆయన ఇప్పుడు విలన్ గా నటిస్తున్నారు. అలాగే విభిన్నమైన పాత్రల్లో నటిస్తూ అభిమానులను ఆకట్టుకుంటున్నారు జగపతిబాబు. ఇటీవలే సలార్ సినిమాతో పాన్ ఇండియా హిట్ అందుకున్నారు. ఇదిలా ఉంటే జగపతి బాబుకు సంబంధించిన ఓ ఓల్డ్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది.

ఆ హీరోయిన్‌ను చూస్తే ఎవ్వరికైనా గౌరవం ఇవ్వాలనిపిస్తుంది.. చాలా మంచింది : గుణశేఖర్

ఈ వీడియోలో జగపతి బాబు మాట్లాడుతూ.. “నా కూతురు ఎవరో విదేశీయుడిని పెళ్లి చేసుకుంటుందని కొంతమంది నా కులానికి చెందిన వారు.. ఇంత పెద్ద ఫ్యామిలీ మీది.. వీరమాచినేని ఫ్యామిలీ అంటే నాలుగు పెద్ద ఫ్యామిలీలో ఒకటి.. అలాంటిది మీ అమ్మాయి ఓ తెల్లోడిని చేసుకుంటుందా..? వాడిని ఎలాగోలా అక్కడి మినిస్ట్రీకి చెప్పి డ్రగ్స్ కేసులో ఇరికించి.. జీవితాల్లో బయటకు రాకుండా చేద్దాం.. అని కొంతమంది కుట్ర చేశారు అని అన్నారు. “జనం ఎంత వెనకబడి ఉన్నారో ఇది చూస్తే అర్ధమవుతుంది.

BiggBoss 10: అమ్మబాబోయ్.. ఒకొక్కరికి అంత రెమ్యునరేషనా..! అందరికంటే ఎక్కువ ఎవరికో తెలుసా

నేను వాళ్లకు చెప్పా.. మీరు ఈ ఎదవ ఆలోచనలు , ఎదవ పనుల్లో చెయ్యొద్దు. నువ్వు అలా చేస్తే నా జీవితమంతా నేను వాడిని బయటకు ఎలా తీసుకురావాలని అని నేను ఇబ్బందిపడతా.. మా అమ్మాయి, ఆ అబ్బాయి ప్రేమించుకున్నారు. మీకెందుకు అయ్యా మధ్యలో.. మాకు లేని గొడవ మీకెందుకు అని చెప్పా.. ఏంటి కులం.? మనమేమైనా పుట్టించామా..? నేను హైదరాబాద్ లో ఉంటున్నా అంటే నేను ఉంటున్నా అంతే.. హైదరాబాద్ నాది కాదు.. అసలు సంబంధం లేకుండా మాట్లాడుతారు.. అందుకే నేను జనాలను ఎక్కువగా కలవను” అని అన్నారు జగపతి బాబు.. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ అవుతుంది.

ఇవి కూడా చదవండి



BiggBoss10: ఊహించని ట్విస్ట్.. హౌస్ నుంచి ఫస్ట్ ఎలిమినేషన్.. అతను అవుట్.?

Jagapathi Babu

 

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *