Headlines

పైలట్స్ బీ అలర్ట్.. ఇకపై ప్రతి ఏటా డోపింగ్ పరీక్ష ! | DGCA Considers Mandatory Annual Drug Testing for All Commercial Pilots


దేశంలోని ప్రతి వాణిజ్య పైలట్‌కు సంవత్సరానికి కనీసం ఒక్కసారైనా రాండమ్ డోపింగ్ పరీక్ష నిర్వహించాలనే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం మొత్తం పైలట్ నెట్‌వర్క్‌లో కేవలం 10 శాతం మందికి మాత్రమే రాండమ్‌గా డోప్ టెస్టులు జరుగుతున్నాయని పేర్కొన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) విమానయాన సంస్థలు, ఇతర భాగస్వాములతో చర్చలు జరుపుతూ 100 శాతం పరీక్షల అమలుపై వ్యూహరచన చేస్తోందని ఆయన వెల్లడించారు.

ప్రస్తుతం నియమం ప్రకారం మొత్తం పైలట్ నెట్‌వర్క్‌లో 10 శాతం మందికి పరీక్షలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం డీజీసీఏ భాగస్వాములతో చర్చలు జరుపుతోంది. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం భద్రతా కారణాల రీత్యా ప్రతి పైలట్ సంవత్సరంలో ఏదో ఒక రాండమ్ సమయంలో పరీక్ష చేయాలన్న ఆలోచనలో ఉంది. భద్రతా అంశాన్ని ప్రాధాన్యం ఇస్తూనే విమానయాన సంస్థల ఆపరేషనల్ ప్రభావం దెబ్బతినకుండా పౌర విమానయాన శాఖ వ్యవహరించనుంది. 100 శాతం పరీక్షలు అమలు చేస్తే ఎలాంటి ప్రభావం ఉంటుందో అంశంపై ప్రస్తుతం డీజీసీఏ అధ్యయనం చేస్తుంది.

ఫుకెట్-ఢిల్లీ ఎయిర్ ఇండియా విమానం ఘటన నేపథ్యంలో ప్రస్తుతం పైలట్లకు డోపింగ్ టెస్టుల అంశం తెరమీదికి వచ్చింది. ఆగస్టు 4న ఎయిర్ ఇండియా విమానం (AI 2379) ఆకస్మికంగా సుమారు 300 అడుగులు ఎత్తులో కుదుపులకు లోనవడంతో కొందరు ప్రయాణికులు, క్రూ సభ్యులు గాయపడ్డారు. ఆ తర్వాత పైలట్-ఇన్-కమాండ్ మారిజువానా పాజిటివ్‌గా టెస్ట్ అయినట్లు తెలిసింది. ఎయిర్‌క్రాఫ్ట్ యాక్సిడెంట్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో (AAIB) దర్యాప్తు కొనసాగుతోంది.

విమానం డేటా రికార్డర్లు సహా అన్ని ఆధారాలు సురక్షితంగా ఉన్నాయని, త్వరలోనే ప్రాథమిక నివేదిక రావచ్చని పౌర విమానయాన శాఖ మంత్రి తెలిపారు. ఎయిర్ ఇండియా గ్రూప్ ఇప్పటికే తమ పైలట్లందరికీ తప్పనిసరి డోప్ టెస్టింగ్ ప్రారంభించింది. ఇతర విమానయాన సంస్థలు కూడా స్వచ్ఛందంగా పరీక్షలు నిర్వహిస్తున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *