Headlines

పొగాకు రైతులకు గుడ్‌న్యూస్.. క్వింటాల్‌ రూ.1000 ఆర్థిక సాయం, రూ50వేల వరకు వడ్డీలేని రుణాలు! | AP Govt Relief for Tobacco Farmers: Rs 1,000 Extra Per Quintal and 50K Interest Free Loan

పొగాకు రైతులకు గుడ్‌న్యూస్.. క్వింటాల్‌ రూ.1000 ఆర్థిక సాయం, రూ50వేల వరకు వడ్డీలేని రుణాలు! | AP Govt Relief for Tobacco Farmers: Rs 1,000 Extra Per Quintal and 50K Interest Free Loan


రాష్ట్రంలోని పొగాకు రైతులకు కూటమి ప్రభుత్వం అదిరిపోయే శుభవార్త చెప్పింది. పొగాకు రైతులను ఆదుకునేందుకు క్వింటాల్‌కు రూ.1000 అదనంగా ఇవ్వాలని డిసైడ్ అయ్యింది. తాజాగా రాష్ట్రంలోని పొగాకు ధరల సమస్యపై మంత్రుల హాజరైన అచ్చెన్నాయుడు, గొట్టిపాటి రవి, డోలా సమీక్ష సమావేశం నిర్వహించారు. పలు కీలక అంశాలపై చర్నించిన తర్వాత పొగాకు నాణ్యత నిర్ధారణ కోసం ఐదుగురు సభ్యుల కమిటీ ఏర్పాటు చేస్తూ మంత్రులు కీలక నిర్ణయం తీసుకున్నారు.

అలాగే ప్రతి క్వింటాల్‌కు ప్రభుత్వం నుంచి రూ.1000 ఇవ్వాలని నిర్ణయించారు. అలాగే పొగాకు రైతులకు రెండేళ్ల పాటు ఎలాంటి వడ్డి లేకుండా రూ.50 వేల వరకు రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. అంతేకాదు పొగాకు కొనుగోలు చేసిన 9 రోజుల్లోనే రైతుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నట్టు మంత్రులు తెలిపారు. వైసీపీ హయాంలో పొగాకు రైతులకు చేసిందేమీలేదని.. చంద్రబాబు పాలనలోనే రైతులకు మేలు జరుగుతుందని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు.

అలాగే రాబోయే సంవత్సరం పొగాకు సాగు 80 మిలియన్ కిలోలకు కట్టడి చేయాలని నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. అయితే కొందరు దీన్ని రాజకీయం చేయాలని ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వ హాయంలో కేవలం 11 మిలియన్ కిలోలు మాత్రమే మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేశారని.. రైతులు ఈ విషయం గుర్తించాలని అన్నారు. అలాగే నాణ్యత విషయంలోనూ కఠినంగా ఉంటామని.. గ్రేడ్ తక్కువని చెప్పి వ్యాపారులు ఇష్టారాజ్యంగా ధరలు వేసేందుకు వేళ్లేదన్నారు. .

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి,.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *