Headlines

మఖానా ఇలా తిన్నారంటే.. శరీరానికి కొండంత బలం.. ఎముకల ఆరోగ్యానికి దివ్యౌషధం! | Eat Makhana with Milk Like This: A Powerful Combination for Stronger Bones and Better Health!


పూల్‌మఖానా, పాలు రెండూ పోషకాల గనులు. వీటిని కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. ముఖ్యంగా పాలు, మఖానా రెండింటిలోనూ క్యాల్షియం, విటమిన్ డి పుష్కలంగా ఉండటం వల్ల ఎముకలు, పళ్లు దృఢంగా మారతాయి. జీర్ణక్రియను మెరుగుపరచడంతో పాటు శక్తిని అందించి, బరువు నియంత్రణకు కూడా ఈ మిశ్రమం ఎంతో తోడ్పడుతుంది. మరిన్ని లాభాలేంటో ఇప్పుడు చూద్దాం..

బలమైన ఎముకలు, పళ్లు- పాలు, మఖానా రెండూ క్యాల్షియం, మెగ్నీషియం, ప్రోటీన్లకు నిలయాలు. వయసు పెరిగే కొద్దీ ఎముకల సాంద్రత తగ్గిపోయే ప్రమాదాన్ని ఇది నివారిస్తుంది. రెగ్యులర్‌గా మఖానా పాలు తాగడం వల్ల కీళ్ల నొప్పులు, వాపులు తగ్గి ఎముకలు ఎంతో దృఢంగా తయారవుతాయి.

ప్రశాంతమైన నిద్ర, ఒత్తిడి తగ్గింపు- ఆందోళన, నిద్రలేమితో బాధపడేవారికి మఖానా పాలు ఒక అద్భుతమైన నివారణ. మఖానాలో ఉండే నాచురల్ సెడేటివ్ గుణాలు, పాలలోని ట్రిప్టోఫాన్ అమినో యాసిడ్ కలిసి నరాలను ప్రశాంతపరుస్తాయి. రాత్రి పడుకునే ముందు గోరువెచ్చని మఖానా పాలు తాగితే ప్రశాంతమైన నిద్ర పడుతుంది.

ఇవి కూడా చదవండి



గుండె ఆరోగ్యం, రక్తపోటు నియంత్రణ- మఖానాలో సోడియం పరిమాణం చాలా తక్కువగా, పొటాషియం, మెగ్నీషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి శరీరంలో రక్తప్రసరణను క్రమబద్ధీకరించి, అధిక రక్తపోటు రాకుండా కాపాడతాయి. దీనివల్ల గుండె సంబంధిత జబ్బులు వచ్చే ముప్పు తగ్గుతుంది.

జీర్ణక్రియ, బరువు నియంత్రణ- ఈ మిశ్రమంలో పీచు పదార్థం సమృద్ధిగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను వేగవంతం చేసి, మలబద్ధకం సమస్యను నివారిస్తుంది. క్యాలరీలు తక్కువగా ఉండే మఖానా పాలను తీసుకోవడం వల్ల కడుపు నిండిన భావన కలిగి, అనవసరమైన ఆకలి తగ్గుతుంది. ఫలితంగా బరువు తగ్గుతారు.

మఖానా పాలను ఎలా తయారు చేసుకోవాలి?: ఒక పాత్రలో కప్పు పాలను మరిగించి, అందులో కాస్త నెయ్యిలో వేయించిన 8-10 మఖానాలను వేయాలి. పాలు కాస్త చిక్కబడే వరకు మరిగించి, చిటికెడు యాలకుల పొడి లేదా పసుపు కలుపుకుని తాగితే రుచితో పాటు అపూర్వమైన ఆరోగ్యం మీ సొంతమవుతుంది.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *