Headlines

Irumudi OTT: ఆడియెన్స్ గెట్ రెడీ.. ఓటీటీలోకి వచ్చేస్తోన్నరవితేజ ‘ఇరుముడి’! స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే? | Ravi Teja Starrer Irumudi Movie Likely To Stream on Netflix OTT from September Last Week


మాస్ మహరాజా రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా ‘ఇరుముడి’. శివ నిర్వాణ తెరకెక్కించిన ఈ డివోషినల్ థ్రిల్లర్ లో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్‌గా నటించింది. ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇరుముడి సినిమా సంచలన విజయం సాధించింది. తండ్రి, కూతుళ్ల సెంటిమెంట్‌ కు తోడు అయ్యప్ప స్వామి నేపథ్యం ఉండడంతో ఇరుముడి సినిమాకు బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు వచ్చాయి. ఇప్పటికే ఈ సినిమా రూ. 250 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. రిలీజై మూడు వారాలు గడుస్తున్నా ఇరుముడి సినిమాకు హౌస్ ఫుల్ కలెక్షన్లు వస్తున్నాయి. చాలా చోట్ల ట్రాక్టర్లతో వెళ్లి మరీ థియేటర్లలో ఈ సినిమాను చూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరుముడి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ పై ఆసక్తి రేపుతోంది. సాధారణంగా ఒక సినిమా థియేటర్లలో రిలీజయ్యాక నాలుగైదు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. మరీ పెద్ద సినిమాలైతే ఆరు వారాలు పట్టవచ్చు. మరీ బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఇరుముడి ఎప్పుడు ఓటీటీలోకి వస్తుందా? అని ఆడియెన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ భారీ ఫ్యాన్సీ ధరకు ‘ఇరుముడి’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. నిబంధనల ప్రకారం సినిమా విడుదలైన నాలుగు వారాల తర్వాత డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లోకి తీసుకురావాల్సి ఉంది. దీని సెప్టెంబర్ 18 నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ ప్రారంభం కానుందనే ప్రచారం జోరుగా సాగింది.

అయితే ఇప్పుడు ఇరుముడి స్ట్రీమింగ్ డేట్ మారిందని సమాచారం. థియేటర్లలో మంచి కలెక్షన్లు వస్తున్నందున ఓటీటీ విడుదలను మరికొన్ని రోజులు వాయిదా వేసే యోచనలో నిర్మాతలు ఉన్నట్లు సమాచారం. దీనిపై వారు ఇప్పటికే నెట్‌ఫ్లిక్స్ ప్రతినిధులతో చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. దీంతో ఇరుముడి స్ట్రీమింగ్ మరింత ఆలస్యం కావొచ్చునని తెలుస్తోంది. అయితే త్వరలోనే దీనిపై ఓ క్లారిటీ రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ భారీ బడ్జెట్‌తో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఇరుముడి సినిమాను నిర్మించారు. సాయికుమార్, అజయ్ ఘోష్, రమేష్ ఇందిర, స్వాసిక కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో రవితేజ కూతురిగా నటించిన నక్షత్ర బాగా హైలెట్ అయ్యింది. అలాగే కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ జీవీ ప్రకాశ్ కుమార్ అందించిన ఈ పాటలు సినిమా విజయంలో కీలక పాత్రలు పోషించాయి.

మల్లెపూల పల్లకి సాంగ్.. ఫుల్  వీడియో..



ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *