Headlines

మెగా ఫ్యామిలీకి వెరీ గుడ్ టైం.. కొణిదెల సుస్మితకు కీలక పోస్ట్.. | Konidela sushmitha appointed special invitee indrakeeladri durga temple trust board


ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డులో చిరంజీవి పెద్ద కుమార్తె కొణిదెల సుస్మితకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. సుస్మిత కొణిదెలను శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం ట్రస్ట్ బోర్డుకు స్పెషల్ ఇన్వైటీగా(ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. ట్రస్ట్ బోర్డు, ఈవోకు అవసరమైన సందర్భాల్లో తన అనుభవంతో సుస్మిత సలహాలు ఇవ్వనున్నారు. ప్రధాన ఆలయ ఉత్సవాలు, జాతరల సమయంలో దేవస్థానం నిర్వహణకు సహకరించనున్నారు. ఇప్పటికే మెగా కుటుంబం నుంచి పలువురు వివిధ కీలక బాధ్యతల్లో ఉన్న నేపథ్యంలో.. ఇప్పుడు చిరంజీవి కుమార్తె సుస్మితకు ఇంద్రకీలాద్రి దుర్గమ్మ దేవస్థానంలో స్పెషల్ ఇన్వైటీగా అవకాశం దక్కింది.

యాదాద్రి నుంచి ఇంద్రకీలాద్రి వరకు.. ఆలయ బాధ్యతల్లో మెగా కుటుంబం

ఇటీవల చిరంజీవి సతీమణి కొణిదెల సురేఖకు యాదాద్రి దేవస్థానం ట్రస్ట్ బోర్డులో సభ్యురాలిగా అవకాశం దక్కగా.. ఇప్పుడు ఏపీలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఇంద్రకీలాద్రిలో సుస్మితకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా అవకాశం కల్పించారు.  దుర్గమ్మ దేవస్థానం ట్రస్ట్ బోర్డులో సుస్మిత కొణిదెలకు ప్రత్యేక బాధ్యత.. ఆలయ ఉత్సవాలు, నిర్వహణలో తన అనుభవంతో సహకరించనున్నారు.

సుస్మిత తన స్టడీస్ కంప్లీట్ అయ్యాక ‘నిఫ్ట్‌’లో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేశారు. అనంతరం ఫిల్మ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. రంగస్థలం, ఖైదీ నెంబర్‌ 150, సైరా, ఆచార్య, వాల్తేరు వీరయ్య చిత్రాలకు కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేశారు. తర్వాత ‘గోల్డ్‌బాక్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌’ (Gold Box Entertainment) పతాకంపై ‘శ్రీదేవి శోభన్‌బాబు’ సినిమా నిర్మించి నిర్మాతగా మారారు.  ఆ తర్వాత తన తండ్రి మన శంకర వరప్రసాద్ గారు చిత్రానికి ఒక నిర్మాతగా వ్యవహరించి హిట్ అందుకున్నారు.

అటు ప్రభుత్వంలో కీలక పదవుల్లో మెగా బ్రదర్స్..

ఇక ఏపీ ప్రభుత్వంలో కీలక మిత్రపక్షంగా, డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ బాధ్యతలు నిర్వర్తిస్తుండగా.. నాగబాబు ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్మన్, ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. సో మెగా ఫ్యామిలీకి ఇది చాలా మంచి టైం అనే చెప్పాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *