Headlines

రామాయణకు గాడ్జిల్లా దెబ్బ.. గ్లోబల్ ఐమ్యాక్స్ స్క్రీన్ల కోసం బిగ్ వార్! | Ramayana vs Godzilla Minus Zero: IMAX Screens Become the Next Global Battle video – Entertainment Videos in Telugu

రామాయణకు గాడ్జిల్లా దెబ్బ.. గ్లోబల్ ఐమ్యాక్స్ స్క్రీన్ల కోసం బిగ్ వార్! | Ramayana vs Godzilla Minus Zero: IMAX Screens Become the Next Global Battle video – Entertainment Videos in Telugu


ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్‌కు ఎదుగుతున్న క్రమంలో హాలీవుడ్ సినిమాల నుంచి పోటీ తప్పట్లేదా..? ఇంగ్లీష్ సినిమాలు ఇండియాకు వచ్చినపుడు ఎదురెళ్లి మరీ ఐమాక్స్ స్క్రీన్స్ ఇస్తుంటాం మనం.. కానీ మన సినిమాలకు అక్కడదే రెస్పాన్స్ వస్తుందా..? తాజాగా రామాయణకు గ్లోబల్ వైడ్‌గా ఐమాక్స్ స్క్రీన్స్ రగడ మొదలైపోయింది. మరో సినిమా పోటీకి వచ్చేసింది. మరి అదేంటో చూద్దామా..? రామాయణపై ఇండియాలో హై ఎక్స్‌పెక్టేషన్స్ ఉన్నాయి.. ఇంటర్నేషనల్‌గానూ ఈ సినిమాను సోనీ పెద్ద ఎత్తున రిలీజ్ ప్లాన్ చేస్తుంది. కానీ ఇదే టైమ్‌లో ‘గాడ్జిల్లా మైనస్ జీరో’ సినిమాతో మన రామాయణకి తిప్పలు తప్పట్లేదు. ‘గాడ్జిల్లా మైనస్ వన్’కి సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమా కూడా రామాయణ రానున్న నవంబర్ 6నే విడుదల కాబోతుండటం దర్శక నిర్మాతలకు తలనొప్పిగా మారింది. సెప్టెంబర్ 26న న్యూ యార్క్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో గాడ్జిల్లా స్పెషల్ ప్రీమియర్ వేస్తున్నారు.. పూర్తి ఐమాక్స్ టెక్నాలజీతో వస్తున్న ఈ విజువల్ వండర్‌తో పోటీ పడాలంటే.. రామాయణకు గ్లోబల్ వైడ్‌గా ఐమాక్స్ స్క్రీన్స్ కొరత కాస్త గట్టిగానే తగిలేలా కనిపిస్తోంది. ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నా.. రామాయణ నిర్మాత నమిత్ మల్హోత్రా మాత్రం థియేటర్ల పంపకాల విషయంలో చాలా కాన్ఫిడెంట్‌గా కనిపిస్తున్నారు. రామాయణ డిస్ట్రిబ్యూషన్ రైట్స్ సోనీ ఎంటర్‌టైన్మెంట్స్ చేతిలో ఉండటంతో.. కావాల్సినన్ని స్క్రీన్స్ దొరుకుతాయనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్. పైగా రెండు జానర్స్ పూర్తిగా వేరు కాబట్టి కంటెంట్ పరంగా క్లాష్ లేదు కానీ స్క్రీన్స్ షేరింగ్ దగ్గరే సమస్య వచ్చేలా ఉంది. ఎలాగో ఇండియాలో రామాయణ డామినేషన్ ఉన్నా.. గ్లోబల్ మార్కెట్‌లోనే గాడ్జిల్లా అరుపులకు మన సినిమా తట్టుకోవాలి.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్లాస్టిక్‌ కరెన్సీపై కేంద్రం క్లారిటీ.. ఇక పేపర్‌ నోట్లు బంద్‌?

అంతరిక్షంలోకి 13.5 లక్షల మంది పేర్లు.. నాసా సరికొత్త ప్రయోగం!

డెన్మార్క్ రాజకుమారి సంచలనం.. రాయల్ లైఫ్ వదిలి మిలిటరీలోకి ప్రిన్సెస్ ఇసాబెల్లా!

మీ రేషన్ కార్డ్ స్మార్ట్‌కార్డ్‌గా మారబోతోంది.. ఆగస్టు 15న పంపిణీ

హైదరాబాద్‌లో అతిపెద్ద క్రైసిస్.. ఇళ్లు వదిలి పారిపోతున్న పిల్లలు.. తప్పు ఎక్కడ జరుగుతోంది?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *