Headlines

రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే! | Massive Cobra Crawls Onto Sleeping Man in Shocking Viral Video tv9d – Viral Videos in Telugu


పగలంతా పని చేసి అలసిపోయి రాత్రి హాయిగా నిద్రపోతున్న ఓ వ్యక్తికి ఊహించని పరిస్థితి ఎదురైంది. సాధారణంగా పాములంటే చాలామందికి భయం. కొందరికి పాము పేరు చెబితేనే వెన్నులో వణుకు పుడుతుంది. అలాంటిది ఓ భారీ నాగుపాము ఇంట్లోకి చొరబడితే.. అది కూడా రాత్రివేళ.. మంచి నిద్రలో ఉన్నప్పుడు…సరిగ్గా అలాంటి దృశ్యం ఒకటి ఇప్పుడు నెట్టింట తెగ వైరల్‌ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియోలో పెద్ద హాలులా ఉన్న ఓ గదిలో వరుసగా మూడు మంచాలు ఉన్నాయి. ఒక మంచంపై ఓ యువకుడు పడుకొని నిద్రపోతున్నాడు. ఇంతలో ఆ గదిలోకి ఓ భారీ నాగుపాము ప్రవేశించింది. అది నేరుగా ఆ వ్యక్తి పడుకున్న మంచంపైకి పాకుతూ వెళ్లింది. అలా పాకుతూ మళ్లి కిందకు దిగబోయి వెనుతిరిగి ఆ వ్యక్తి ఒంటిపైకి వచ్చింది. గాఢనిద్రలో ఉన్న అతనికి సడన్‌గా మెలకువ వచ్చి చూసేసరికి తన ఒంటిపై విష సర్పం ఉండడం గమనించాడు. దీంతో కంగారు పడిన అతను కాళ్లను బలంగా ఆడిస్తూ పామును ఒంటిపైనుంచి దులిపాడు. ఆ పాము కిందపడి గది మూలవైపు వేగంగా పాకుతూ వెళ్లి అక్కడ దాక్కున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. ఊహించని ఈ పరిణామంతో భయపడిపోయిన ఆ వ్యక్తి బయటకు పరుగుతీశాడు. ఆ సమయంలో పాము కాటుకు ప్రయత్నించి ఉంటే పరిస్థితి అత్యంత ప్రమాదకరంగా మారేదని వీడియో చూసిన నెటిజన్లు వ్యాఖ్యానించారు. ‘‘జీవితం, మరణం మధ్య కొన్ని క్షణాలు’’ అంటూ పలువురు కామెంట్లు చేశారు. ఈ వీడియో ఎక్కడ, ఎప్పుడు చిత్రీకరించారనే విషయంపై స్పష్టమైన సమాచారం లేదు. ఈ వీడియోలో కనిపిస్తున్న పాము నిజంగా నాగుపామేనా అనే అంశం పైనా చర్చ జరుగుతోంది. వర్షాకాలం, వేసవి సమయంలో పాములు తమకు అనుకూలమైన ప్రదేశాల కోసం ఇళ్లలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది. అందుకే పాముల విషయంలో అప్రమత్తంగా ఉండాలంటున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం!

LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్!

అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు

Irumudi Review: రవితేజ ఖాతాలో హిట్ పడిందా? లేదా ? ఇరుముడి రివ్యూ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *