Headlines

EPFO: పీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇకపై రూ.25 వేలు.. త్వరలో నిర్ణయం..! | EPF Salary Limit May Rise to 25000: Higher Pension Benefits Likely for Private Employees

EPFO: పీఎఫ్‌పై కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్.. ఇకపై రూ.25 వేలు.. త్వరలో నిర్ణయం..! | EPF Salary Limit May Rise to 25000: Higher Pension Benefits Likely for Private Employees


దేశంలో ప్రైవేట్ కంపెనీల్లో ఉద్యోగాలు చేసేవారికి ఊరట కలిగించేలా కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయానికి శ్రీకారం చుడుతోంది. ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్(EPF) పథకం పరిధిని మరింత విస్తరించేందుకు సిద్దమవుతోంది. ఇప్పటివరకు పీఎఫ్ కనీస శాలరీ లిమిట్ రూ.15 వేలు మాత్రమే ఉంది. దీంతో రూ.15 వేలు శాలరీ ఉన్నవారు ఖచ్చితంగా పీఎఫ్‌లో చేరాల్సి ఉంటుంది. ఆ పైన వేతనం పొందేవారు స్వచ్చంధంగా ఇందులో చేరవచ్చు. యజమాని, ఉద్యోగి అంగీకారంతో పీఎఫ్ పరిధిలో చేరవచ్చు. దీంతో అధిక జీతం పొందేవారు పీఎఫ్ ప్రయోజనాలకు దూరమవుతున్నారు. దీంతో పీఎఫ్ వేతన పరిమితిని పెంచాలనే డిమాండ్లు ఎప్పటినుంచో వినిపిస్తుండగా.. ఇప్పుడు కేంద్రం ఎట్టకేలకు దిగొచ్చింది.

రూ.25 వేలకు వేతన పరిమితి పెంపు..!

పీఎఫ్ శాలరీ లిమిట్‌ను రూ.25 వేలకు పెంచేందుకు కేంద్ర ఆర్థికశాఖ ఆమోదం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ఆర్థికశాఖ ఈ ప్రతిపాదనను కేబినెట్ ముందు ఉంచనుంది. కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన తర్వాత కొత్త వేతన పరిమితి అమల్లోకి వస్తుంది. వేతన పరిమితి పెంచడం వల్ల చాలామంది ఉద్యోగులు పెన్షన్ పరిధిలోకి రానున్నారు. రిటైర్మెంట్ తర్వాత ప్రతీనెలా పెన్షన్ ప్రయోజనాలు అందుకోనున్నారు. వేతన పరిమితి పెరగడం వల్ల పెన్షన్ కూడా పెరుగుతుంది. ప్రస్తుత వేతన పరిమితి రూ.15 వేలుగా ఉండటంతో.. 12 శాతం చొప్పున లెక్కిస్తే రూ.1800 కట్ అవుతుంది. దీని ప్రకారం పెన్షన్ చెల్లింపులు లెక్కిస్తారు. పెన్షన్ = (సగటు జీతం x సర్వీసు కాలం)/70 ప్రాతిపదికన పెన్షన్ లెక్కిస్తారు.

10 ఏళ్ల సర్వీసుకు ఎంత పెన్షన్ వస్తుంది..

ఒక వ్యక్తి 10 ఏళ్లు ఉద్యోగం చేస్తే ప్రస్తుతం ఉన్న రూ.15 వేల వేతన పరిమితి ప్రకారం రూ.2,143 పెన్షన్ వస్తుంది. అదే రూ.25 వేలకు పెంచితే రూ.3,571కి పెరుగుతుంది. ఇక 20 ఏళ్లు ఉద్యోగం చేసినవారికి ప్రస్తుతం రూ.4,714 అందుతుంది. రూ.25 వేలకు పెరిగే రూ.7,857కు పెన్షన్ అమౌంట్ పెరుగుతుంది. ఇక 30 ఏళ్ల సర్వీస్ పూర్తి చేసినవారికి ప్రస్తుత రూ.15 వేల లిమిట్ ప్రకారం రూ.6,857 అందుతుంది. రూ.25 వేలకు పెరిగితే రూ.11,429కి పెరుగుతుంది. వేతన పరిమితి పెరగడం వల్ల పెన్షన్ అమౌంట్ కూడా పెరగనుంది. దీని వల్ల రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ప్రతీ నెలా అధిక మొత్తంలో పొందవచ్చు. అయితే ప్రస్తుతం కనీస పెన్షన్ రూ.వెయ్యిగా ఉండగా.. దీనిని రూ.5 వేలకు పెంచాలనే డిమాండ్లు ఉద్యోగాల సంఘాల నుంచి వినిపిస్తోంది. అయితే దీనిపై కేంద్రం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదరు. భవిష్యత్తులో దీనిపై కూడా నిర్ణయం తీసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *