Headlines

వచ్చేశాడ్రోయ్ మరో తోపుగాడు.. 10 సిక్సర్లు, 7 ఫోర్లతో బీభత్సమైన ఇన్నింగ్స్.. అభిషేకే షాకయ్యాడుగా..! | Naman dhir hit century in just 52 balls at Sher E Punjab T20 League 2026


Naman Dhir Century: షేర్-ఎ-పంజాబ్ టీ20 లీగ్‌లో ముంబయి ఇండియన్స్ ఆటగాడు నమన్ ధీర్ విధ్వంసక శతకంతో మెరిశాడు. జలంధర్ వారియర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అమృత్‌సర్ సూర్మాస్ తరపున 56 బంతుల్లో 117 పరుగులు చేశాడు. ఇందులో 7 ఫోర్లు, 10 సిక్సర్లు ఉన్నాయి. 52 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేసిన ధీర్.. కెప్టెన్ అభిషేక్ శర్మతో కలిసి రెండో వికెట్‌కు 151 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. అభిషేక్ 36 బంతుల్లో 82 పరుగులు చేయడంతో అమృత్‌సర్ 20 ఓవర్లలో 264/5 భారీ స్కోరు సాధించింది. వీరిద్దరూ కలిసి 17 సిక్సర్లు బాదగా, జట్టు ఇన్నింగ్స్‌లో మొత్తం 21 సిక్సర్లు నమోదయ్యాయి. అయితే ఇంతటి భారీ స్కోరు చేసినా అమృత్‌సర్‌కు విజయం దక్కలేదు. జలంధర్ వారియర్స్ 16.5 ఓవర్లలోనే 265/2తో లక్ష్యాన్ని ఛేదించింది.

నమన్ ధీర్, అభిషేక్ దూకుడు..

అమృత్‌సర్ ఆరంభంలోనే సహజ్ ధావన్ వికెట్ కోల్పోయింది. ఆ తర్వాత అభిషేక్, ధీర్ కలిసి జలంధర్ బౌలర్లపై ఎదురుదాడి చేశారు. అభిషేక్ 21 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేయగా, ధీర్ 25 బంతుల్లో హాఫ్ సెంచరీ సాధించాడు. అనంతరం ధీర్ మరింత వేగం పెంచి 52 బంతుల్లో మూడు అంకెల స్కోరును అందుకున్నాడు. చివరకు 56 బంతుల్లో 117 పరుగులతో ఔటయ్యాడు.

Viral Video: ఏం క్యాచ్ గురూ.. సూపర్‌మ్యాన్‌ కూడా చేతులెత్తేయాల్సిందే.. బౌండరీ లైన్‌‌లో ఒంటి చేత్తో..!

ఇవి కూడా చదవండి



అభిషేక్ 82 పరుగుల ఇన్నింగ్స్‌లో 5 ఫోర్లు, 7 సిక్సర్లు బాదాడు. వీరిద్దరి భాగస్వామ్యం తర్వాత జషన్‌ప్రీత్ సింగ్ 12 బంతుల్లో 33 పరుగులు చేయడంతో అమృత్‌సర్ స్కోరు 260 దాటింది.

భారీ స్కోరును ఛేదించిన జలంధర్..

265 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జలంధర్ వారియర్స్‌కు కెప్టెన్ ప్రభ్‌సిమ్రన్ సింగ్ అద్భుత ఆరంభం ఇచ్చాడు. అతడు 47 బంతుల్లో అజేయంగా 125 పరుగులు చేయడంతో జలంధర్ 16.5 ఓవర్లలో 265/2 సాధించింది. దీంతో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో మొత్తం 529 పరుగులు నమోదయ్యాయి.

Team India: 24 గంటల్లోనే మరో గాయం.. టీమిండియా స్టార్ ఆల్ రౌండర్ రీఎంట్రీపై వీడని ఉత్కంఠ..?

ధీర్‌ 117 పరుగుల ఇన్నింగ్స్‌తో టోర్నీలో తన స్థానాన్ని బలపర్చుకున్నాడు. లీగ్‌లో రెండు మ్యాచ్‌ల అనంతరం అతడి ఖాతాలో 164 పరుగులు ఉన్నాయి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *