
విశాఖపట్నం జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. పెందుర్తి మండలం చింతల అగ్రహారంలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు విగతజీవులుగా కనిపించడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మల్లా ప్రవీణ్ కుమార్, ఆయన భార్య అహల్యతో పాటు వారి ఇద్దరు చిన్నారులు ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. భార్య, పిల్లలకు తొలుత విషం ఇచ్చి, ఆ తర్వాత ప్రవీణ్ కుమార్ ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.
ఇప్పుడే అందిన వార్త ఇది! మేము ఈ వార్తను అప్డేట్ చేస్తున్నాము. మీకు తొలుత ఈ వార్తను అందించే ప్రయత్నం చేస్తాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ కోసం ఈ పేజీని రిఫ్రెష్ చేయండి. ఈ వార్తకు సంబంధించిన మిగతా కథనాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.