Headlines

శని దోషంతో వారికి ఇబ్బందులు..ఈ రత్నం ధరిస్తే సమస్యలు మటుమాయం..! | Shani Dosha Remedy: This Gemstone Is Considered Highly Auspicious


ప్రస్తుత గ్రహ సంచారం ప్రకారం కొన్ని రాశుల వారు శని దోషం వల్ల రకరకాల కష్టనష్టాలను అను భవించడం జరుగుతోంది. ముఖ్యంగా మేషం, సింహం, కన్య, ధనుస్సు, కుంభం, మీన రాశుల వారు ఆర్థికంగా ఇబ్బందులు పడడం, ఉద్యోగాలు పోవడం, ఏ ప్రయత్నం తలపెట్టినా విఫలం కావడం, అనుకున్నవేవీ జరగకపోవడం, పురోగతిలో ప్రతిష్ఠంభన ఏర్పడడం వంటి దుష్ఫలితాలను అనుభవించాల్సి వస్తోంది. ఈ శని దోషం వచ్చే ఏడాది జూలై వరకు అంటే పదకొండు నెలల వరకు కొనసాగుతుంది. ఈ చెడు ఫలితాల నుంచి బయటపడి, సుఖ సంతోషాలతో జీవితం గడపాలన్న పక్షంలో వీరు తప్పనిసరిగా కొన్ని పరిహారాలు పాటించడం మంచిది.

మేషం

ఈ రాశికి వ్యయ స్థానంలో ప్రవేశించిన శని వల్ల ఈ రాశివారు మరో ఆరేళ్ల పాటు నానా కష్టాలూ అనుభవించాల్సి వస్తుంది. ముఖ్యంగా ఆదాయం కంటే ఖర్చులు పెరగడం, ఆదాయం పెరగకపో వడం, ఉద్యోగం పోవడం, ఉద్యోగం రాకపోవడం, వైద్య ఖర్చులు వృద్ధి చెందడం వంటివి జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. ఈ సమస్యల నుంచి బయటపడాలన్న పక్షంలో శివ స్తోత్రం పఠిం చడం, శనికి చెందిన నీలం లేదా ఇంద్ర నీలం అనే రత్నాన్ని ఉంగరంలో ధరించడం చాలామంచిది.

సింహం

ఈ రాశివారికి మరో ఏడాది పాటు అష్టమ శని దోషం కొనసాగుతుంది. అష్టమ శని దోషం వల్ల వీరికి ఏదీ కలిసి రాకపోవడం, ప్రతిదీ ఆలస్యం కావడం ఎక్కువగా జరుగుతుంటుంది. ఆదాయం పెరగకపోవడం, తనను గానీ, తన కుటుంబ సభ్యులను గానీ తరచూ అనారోగ్యాలు బాధించడం, రావలసిన డబ్బు రాకపోవడం, రుణ బాధలు పెరగడం వంటివి జరుగుతాయి. వీటి నుంచి విముక్తి కోసం తరచూ శివార్చన చేయడం, నీలం అనే రత్నాన్ని ఉంగరంలో ధరించడం చాలా అవసరం.

ఇవి కూడా చదవండి



కన్య

ఈ రాశికి సప్తమ స్థానంలో మరో ఏడాది పాటు సంచారం చేయబోతున్న శని వల్ల పెళ్లి ప్రయత్నాలు సక్సెస్ కాకపోవడం, దాంపత్య జీవితంలో సుఖశాంతులు లోపించడం, ఇష్టమైనవారు దూరం కావడం, దూర ప్రాంతంలో చిన్న ఉద్యోగం చేయవలసి రావడం, పురోగతి స్తంభించిపోవడం వంటివి జరుగుతాయి. జీవితం సాఫీగా, హ్యాపీగా సాగిపోవడానికి వీరు ఎక్కువగా నలుపు లేదా నీలం రంగులు కలిసిన దుస్తులు ధరించడంతో పాటు నీలం రత్నాన్ని చేతికి ధరించడం ఉత్తమం.

ధనుస్సు

ఈ రాశికి చతుర్థ స్థానంలో మరో ఏడాదిపాటు శని సంచారం జరగబోతుంది. ఈ అర్ధాష్టమ శని దోషం వల్ల ఈ రాశివారికి కుటుంబంలో సుఖసంతోషాలు లోపిస్తాయి. మనశ్శాంతి తగ్గుతుంది. మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులతో ఇబ్బందులు పడతారు. గృహ, వాహన సౌకర్యాలకు దూరమవుతారు. ఏ ప్రయత్నమూ ఒక పట్టాన ఫలించకపోవచ్చు. వీరు నీలం పొదిగిన ఉంగరం ధరించడంతో పాటు, తరచూ శివార్చన చేయించడం వల్ల జీవితం మారు తుంది.

కుంభం

ఈ రాశికి ద్వితీయ స్థానంలో మరో ఆరేళ్ల పాటు ఏలిన్నాటి శని దోషం వల్ల ఆదాయం తగ్గే అవకాశం తప్ప పెరిగే అవకాశం ఉండదు. శ్రమ ఎక్కువ ఫలితం తక్కువగా ఉంటుంది. ఖర్చులు పెరు గుతాయి. వ్యక్తిగత, ఆర్థిక సమస్యలు వృద్ధి చెందుతాయి. కుటుంబంలో కలతలు, కలహాలు చెలరే గుతాయి. శుభకార్యాలు ఆగిపోయే అవకాశం ఉంది. ఈ రాశివారు నీలాన్ని ఉంగరంలో పొదిగి ధరించడంతో పాటు, శనికి తరచూ తైలాభిషేకం చేయించడం, శనికి దీపం వెలిగించడం మంచిది.

మీనం

ఈ రాశికి మరో మూడున్నర ఏళ్ల పాటు ఏలిన్నాటి దోషం కొనసాగుతుంది. శని తనకు నీచ స్థానమైన మేషంలో ప్రవేశించినప్పుడు ఏలిన్నాటి శని దోషం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈ దోషం వల్ల వీరి ప్రతిభా పాటవాలు ప్రకాశించవు. తక్కువ స్థాయి వారితో స్నేహ సంబం ధాలు ఏర్పడతాయి. ఉద్యోగంలో పదోన్నతులు ఆగిపోతాయి. ఏ ప్రయత్నమూ సఫలం కాకపో వచ్చు. తరచూ శివార్చన చేయించడంతో పాటు నీలం రత్నాన్ని ఉంగరంలో ధరించడం చాలా మంచిది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *