Headlines

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. పలు ప్రాంతాల్లో తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం.. | Hyderabad Water Supply Alert: Drinking Water Disruption in Several Areas on August 29 to 30th, Check Details


హైదరాబాద్ నగర ప్రజలకు జలమండలి (HMWSSB) కీలక సూచనలు చేసింది. పలు ప్రాంతాలకు తాగునీటి స‌ర‌ఫ‌రాలో అంత‌రాయం కలుగుతుందని.. ప్రజలు నీటిని పొదుపుగా వినియోగించుకోవాలని సూచించింది. జీహెచ్ఎంసీ చేపడుతున్న బండ్లగూడ ఎక్స్ రోడ్ వద్ద బాక్స్ డ్రెయిన్ నిర్మాణ పనులకు అనుకూలంగా, హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే కృష్ణా డ్రింకింగ్ వాటర్ సప్లై ప్రాజెక్ట్ ఫేజ్–III, రింగ్ మెయిన్–Iకి చెందిన 1500 ఎంఎం వ్యాసం గల ఎంఎస్ గ్రావిటీ మెయిన్‌పై జంక్షన్ పని చేపట్టనున్నారు. ప్రతిపాదిత బాక్స్ డ్రెయిన్ అలైన్‌మెంట్‌లో ఈ ప్రధాన పైప్‌లైన్ ఉండటంతో, డ్రెయిన్ నిర్మాణ పనులు నిరాటంకంగా కొనసాగేందుకు జంక్షన్ పని చేపట్టడం అవసరమైంది.

శనివారం నుంచి ఆదివారం..

ఈ పనులు తేది: 29.08.2026, శనివారం ఉదయం 10 గంటల నుంచి తేదీ 30.08.2026 ఆదివారం ఉదయం 10 గంటల వరకు చేపడతారు.

కావున ఈ 24 గంటలు కృష్ణా ఫేజ్–III, రింగ్ మెయిన్–I పరిధిలోని కొన్ని రిజర్వాయర్ కమాండింగ్ ప్రాంతాల్లో పేర్కొన్న సమయంలో ఆయా ప్రాంతాల్లో తాగునీటి సరఫరా పూర్తిగా లేదా పాక్షికంగానూ.. మరికొన్ని ప్రాంతాల్లో లో – ప్రెషర్ తో నీటిసరఫరా జరిగే అవకాశం ఉంది.

నీటి సరఫరా అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

శాస్త్రిపురం, బండ్లగూడ, శంషాబాద్, మధుబన్, దుర్గానగర్, సులేమాన్ నగర్, పీడీపీ, గోల్డెన్ హైట్స్, అత్తాపూర్, కిస్మత్‌పూర్, 9 నంబర్, అల్లాబండ, భోజగుట్ట, గంధంగూడ, ప్రసన్ననగర్, జూబ్లీహిల్స్, తట్టిఖానా, గచ్చిబౌలి, మాదాపూర్ మరియు షేక్‌పేట్ రిజర్వాయర్ పరిధిలోని కొన్ని ప్రాంతాలు.

కావున అంతరాయం ఏర్పడనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటిని పొదుపుగా వాడుకోగలరని జలమండలి సూచించింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *