అందుకే, సాంప్రదాయ పద్ధతిలో వంట చేసేటప్పుడు ఆకును వేసి, అది తన సువాసనను, నూనెలను ఆహారంలోకి విడుదల చేసిన తర్వాత, వడ్డించే ముందు ఆకును తీసి పక్కన పడేయడం ఉత్తమం. లేదంటే, బిర్యానీ ఆకు ఇచ్చే ఆరోగ్య ప్రయోజనాలు కావాలనుకుంటే, దానిని ఎండబెట్టి మెత్తటి పొడిగా చేసి గరం మసాలాల్లో వాడుకోవచ్చు. ఈ రూపంలో తీసుకోవడం వల్ల పీచు సమస్య ఉండదు. సురక్షితంగా జీర్ణమవుతుంది.పైగా, ఈ బిర్యానీ ఆకు కూరలకు అద్భుతమైన ఫ్లేవర్‌ను ఇవ్వడంతో పాటు యాంటీఆక్సిడెంట్లను అందిస్తుంది. కాబట్టి వంటల్లో దీనిని నిరభ్యంతరంగా వాడుకోవచ్చు, కానీ ప్లేట్ లోకి రాగానే మాత్రం ఆకును పక్కన పెట్టేయడమే అందరికీ సురక్షితం!