Headlines

షాకులు, ట్విస్ట్‌లు.. విజయ్ సంగీత పెళ్లి ఎలా జరిగిందో తెలుసా.? సినిమాకు మించిన స్టోరీ..! | Do you know how Thalapathy Vijay and Sangeetha wedding took place

షాకులు, ట్విస్ట్‌లు.. విజయ్ సంగీత పెళ్లి ఎలా జరిగిందో తెలుసా.? సినిమాకు మించిన స్టోరీ..! | Do you know how Thalapathy Vijay and Sangeetha wedding took place


ఇండియన్ సినిమాల్లో దళపతి విజయ్ ఓ స్టార్. హీరోగానే కాదు ఇప్పుడు తమిళనాడు సీఎంగా బిజీగా ఉన్నారు విజయ్. సినిమాలకు పూర్తిగా గుడ్ బై చెప్పేసి ఇప్పుడు రాజకీయాల్లో రాణిస్తున్నారు విజయ్. ఆయనకు ప్రపంచవ్యాప్తంగా అశేషమైన అభిమాన గణం ఉంది. అయితే, విజయ్ వ్యక్తిగత విషయాలు ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే.. ఇటీవల జరిగిన తమిళనాడు ఎన్నికల ముందు విజయ్ భార్య సంగీత విడాకులు కోరుతూ పిటీషన్ వేయడం సంచలనంగా మారింది. వారిద్దరి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో, సంగీత చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానంలో విడాకుల కోసం పిటిషన్ దాఖలు చేశారు. సరిగ్గా ఎన్నికలకు ముందు ఆమె ఈ పని చేయడం అప్పట్లో పెను సంచలనమైంది. తాజాగా జరిగిన విచారణ సందర్భంగా, తాను దాఖలు చేసిన విడాకుల పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు సంగీత ఆకస్మికంగా ప్రకటించింది. దీని తరువాత, విజయ్, సంగీత మధ్య కేసు పూర్తిగా ముగిసిందని చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానం ప్రకటించింది.

ఇదిలా ఉంటే అసలు సంగీత, విజయ్ ఎలా కలిశారు. వీరి పెళ్లి ఎలా జరిగింది అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఇద్దరి వివాహం ఎలా జరిగిందో ఒక్కసారి చూద్దాం.! శ్రీలంక మూలాలున్న తమిళ కుటుంబానికి చెందిన సంగీత, తన తండ్రి వ్యాపారం నిమిత్తం లండన్‌లో స్థిరపడ్డారు. ఆమె అక్కడ ఉన్న సమయంలో విజయ్ నటించిన పూవే ఉనక్కాగ సినిమా చూసి, ఆయనకు వీరాభిమానిగా మారిపోయారు. ఎలాగైనా విజయ్‌ను కలవాలని నిశ్చయించుకుని, తన అక్కతో కలిసి లండన్ నుంచి ఇండియాకు వచ్చారు. అనేక ప్రయత్నాల తర్వాత విజయ్‌ను కలుసుకున్న సంగీతను, సముద్రాలు దాటి తనను చూడటానికి వచ్చినందుకు విజయ్ ఆశ్చర్యపోయారు.

విజయ్ సంగీతను తన ఇంటికి విందుకు ఆహ్వానించారు. అది విజయ్ తల్లిదండ్రులకు, సంగీతకు మధ్య ఒక లాంఛనప్రాయమైన పరిచయంగా మారింది. విజయ్ తల్లిదండ్రులకు సంగీత చాలా నచ్చారు. ఆ తర్వాత సంగీత కొన్ని నెలలపాటు చెన్నైలోనే ఉండి, అప్పుడప్పుడు విజయ్ షూటింగ్‌లకు వెళ్లేవారు. సంగీత మంచి గుణగణాలు, ప్రశాంతమైన స్వభావం చూసి విజయ్ తండ్రి, ప్రముఖ దర్శకుడు ఎస్.ఎ. చంద్రశేఖర్, ఆమెను నేరుగా మా అబ్బాయి నీకు నచ్చాడా? పెళ్లి చేసుకుంటావా? అని అడిగారు. విజయ్‌కు వీరాభిమాని అయిన సంగీత తటపటాయించకుండా అంగీకరించారు. అదేవిధంగా, ఎస్.ఎ. చంద్రశేఖర్ విజయ్‌ను కూడా సంగీతను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమా అని అడిగారట. ఈ ఊహించని ప్రశ్నకు విజయ్ షాక్ అయ్యారు. అయితే, తన జీవితంలో తల్లిదండ్రులు ఎప్పుడూ సరైన నిర్ణయాలు తీసుకున్నారని, తన జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో కూడా వారికే మంచి అవగాహన ఉంటుందని విజయ్ నమ్మారు. “నా జీవితంలో నాకు అన్నీ చేసింది మా అమ్మనాన్న. వాళ్లకు నా సంతోషం ముఖ్యం. అందుకే వారి నిర్ణయానికి నేను సంతోషంగా ఓకే చెప్పాను” అని విజయ్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు.

ఆతర్వాత విజయ్, ఆయన తల్లిదండ్రులతో కలిసి లండన్‌కు వెళ్లి సంగీత తల్లిదండ్రులను కలిసి వివాహాన్ని నిశ్చయించారు. ఆగస్టు 25, 1999న సంగీత, విజయ్‌ల వివాహం హిందూ సాంప్రదాయ పద్ధతిలో చాలా వైభవంగా జరిగింది. పలువురు సినీ ప్రముఖులు ఈ వివాహానికి హాజరయ్యారు. ఈ అందమైన దంపతులకు 2000 సంవత్సరంలో సంజయ్ అనే కుమారుడు, 2005లో దివ్య సాషా అనే కుమార్తె జన్మించారు. చిన్నతనంలో తన సోదరిని కోల్పోయిన విజయ్‌కు ఆడపిల్ల జన్మించడం అత్యంత సంతోషకరమైన క్షణంగా నిలిచింది. సంజయ్ అనే పేరు సంగీత పేరులోని SAN, విజయ్ పేరులోని JAY కలిపి పెట్టిందని చెబుతారు. విజయ్ తన భార్యను ముద్దుగా గీత్ అని పిలుస్తారు. ఇప్పుడు ఈ ఇద్దరూ తిరిగి కలవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *