బంగారం ధరలు పెరుగుతూ వస్తోన్నాయి. గత వారం రోజుల్లో గోల్డ్ రేట్లు ఆమాంతం పెరుగుదలను నమోదు చేశాయి. అంతర్జాతీయంగా ఆర్దిక అనిశ్చితి, ఫెడ్ రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లపై స్పష్టత లేకపోవడం వంటి కారణాలతో పసిడి ధరలు ఊపందుకున్నాయి. జనవరిలో ఆల్ టైం రికార్డ్ సృష్టించిన తర్వాత ఒకే నెలలో గోల్డ్ రేట్లు భారీగా ఈ నెలలోనే పెరిగాయి. దీంతో కొనుగోలుదారులు ఎక్కువ ఖర్చు పెట్టాల్సి వస్తోంది. త్వరలోనే పెళ్లిళ్ల సీజన్ మళ్లీ మొదలుకానుంది. ఈ క్రమంలో బంగారం ధరలు పెరుగుతుండటంతో కొనుగోలు చేయాలనుకునేవారు నిరాశ చెందుతున్నారు. గత వారం రోజుల్లో బంగారం, వెండి ధరలు ఎంత పెరిగాయనేది ఇప్పుడు చూద్దాం.
వారం రోజుల్లో ఎంత పెరిగాయంటే..?
భారత బులియన్ మార్కెట్లో ఆగస్ట్ 1వ తేదీన 1 గ్రాము 24 క్యారెట్ల బంగారం ధర రూ.14,422 వద్ద మొదలైంది. ఇక ఆగస్ట్ 4న స్వల్పంగా తగ్గి రూ.14,400కి చేరుకోగా.. ఆగస్ట్ 8 నాటికి మళ్లీ పెరిగింది. ఇవాళ 1 గ్రాము బంగారం ధర రూ.15,235 వద్ద కొనసాగుతోంది. ఇక 22 క్యారెట్ల విషయానికొస్తే .. ఆగస్ట్ 1న రూ.13,220 వద్ద ఉండగా.. ఆగస్ట్ 8 నాటికి రూ.13,965కి చేరుకుంది. ఇక ఆగస్ట్ 1న 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,44,610 వద్ద ఉండగా.. ఆగస్ట్ 8 నాటికి రూ.1,52,350కి చేరుకుంది. వారం రోజుల్లో ఏకంగా రూ.7,740 మేర పెరిగింది.
నేడు బంగారం ధరలు ఇలా..
-హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల స్వచ్చమైన బంగారం ధర రూ.1,52,350 వద్ద ట్రేడవుతోంది. ఇక 22 క్యారెట్ల ధర రూ.1,39,650 వద్ద కొనసాగుతోంది
-చెన్నైలో 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.1,51,640 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,39,000గా ఉన్నాయి.
-దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,52,550గా ఉండగా.. 22 క్యారెట్ల ధర చూస్తే రూ.1,39,850 వద్ద కొనసాగుతున్నాయి.
-బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,52,350 వద్ద ట్రేడవుతోండగా.. 22 క్యారెట్ల రేటు రూ.1,39,650గా ఉంది.
వెండి రేట్లు ఎలా ఉన్నాయంటే..?
బెంగళూరులో ఇవాళ కేజీ సిల్వర్ ధర రూ.2.45 లక్షల వద్ద కొనసాగుతోంది. ఇక చెన్నైలో కేజీ వెండి ధర రూ.2.50 లక్షలుగా ఉంది. హైదరాబాద్లో రూ.2,49,900 వద్ద ట్రేడవుతోంది.