Headlines

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో వారం పాటు వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్ రిపోర్ట్‌! | AP and Telangana Weather Alert: Heavy Rains Forecast Due to Low Pressure

Weather Report: తెలుగురాష్ట్రాలకు బిగ్‌ అలర్ట్.. ఈ జిల్లాల్లో మరో వారం పాటు వర్షాలు.. లేటెస్ట్‌ వెదర్ రిపోర్ట్‌! | AP and Telangana Weather Alert: Heavy Rains Forecast Due to Low Pressure


గత సీజన్‌తో పోల్చుకుంటే తెలుగురాష్ట్రాలపై వరుణుడి కఠాక్షం ఇలా సారి పెద్దగా కనిపించడం లేదు. సీజన్ మొదటి నుంచి రెండు తెలుగురాష్ట్రాల్లో వర్షాలు మందకోడిగా పడుతున్నాయి. కానీ గత వారం రోజులుగా పరిస్థితి మారిపోయింది. రైతులకు ప్రజలకు కాస్త ఉపశమనం కలిగిస్తూ వర్షాలు కురుస్తున్నాయి. ఇక రాబోయే వారం రోజులుగు కూడా ఇదే పరిస్థితి ఉండొచ్చని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తణం అనేది క్రమంగా బలపడి ప్రస్తుతం అల్పపీడనంగా మారిందని.. ఇది ఒడిసా, ఛత్తీస్‌గఢ్, బెంగాల్ మీదుగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వరకు ఉందని తెలిపింది.

ఇది ప్రస్తుతం పశ్చిమ దిశగా కదులుతూ మహారాష్ట్ర, గుజరాత్ వైపు వెళ్లే అవకాశం ఉందని.. దీని ప్రభావంతో మన తెలుగురాష్ట్రాల్లో రాబోయే వారం పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే వర్షాల సమయంలో గంటకు 40 నుంచి 60 కిలో మీటర్ల వేగంలో ఈదురుగాలులు కూడా వీచే ఛాన్స్ ఉందని తెలిపింది. వాహనాలు నడిపే వారు, సముద్రంలోకి వెళ్లే వారు చాలా జాగ్రత్తగా ఉండాలని అధికారులు చెబుతున్నారు.

తెలుగురాష్ట్రాల్లో ఇవాళ వాతావరణం ఇదే

ఇక ఈ రోజు వాతావరణం ఎలా ఉండబోతుందనే విషయానికి వస్తే.. ఏపీ, తెలంగాణలో ఈ రోజు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని.. తెలంగాణలో హైదరాబాద్‌ సహా మేడ్చల్ – మల్కాజిగిరి, మెదక్, సిద్దిపేట, సిరిసిల్ల, కరీంనగర్, యాదాద్రి – భోంగిర్, హన్మకొండలోని కొన్ని భాగాలు, వరంగల్, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి – కొత్తగూడెం జిల్లాలో వర్షాలు కురిసే ఛాన్స్ కనిపిస్తోంది. మరికొన్ని జిల్లాల్లో తేలిక పాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇక ఆంధ్రప్రదేశ్‌ విషయానికి వస్తే.. ఉత్తర, కోస్తాంధ్రలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పలు ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. సాయంత్రం తర్వాత ఉత్తరాంధ్రలో వర్షాలు కురుస్తాయని.. ఇవి అర్థరాత్రి వరకూ కొనసాగే ఛాన్స్ ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక రాయలసీమలో వర్షాలు పడే ఛాన్స్ కాస్త తక్కువగానే ఉందని.. అక్కడ పొడి వాతవరణం ఉండే ఛాన్స్ ఉందని తెలిపింది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *