Headlines

Andhra News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు.. | Major Road Accident in Anantapur: Private Travel Bus and Eicher Vehicle Collide, 20 Injured

Andhra News: ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం.. బ్రిడ్జిపై నుంచి కిందపడ్డ బస్సు.. 20 మందికి తీవ్ర గాయాలు.. | Major Road Accident in Anantapur: Private Travel Bus and Eicher Vehicle Collide, 20 Injured


అనంతపురం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నేషనల్ హైవేపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదానికి గురైంది. బస్సును ఐషర్ వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న 20 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను తొలుత పామిడి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా..  అక్కడ నుంచి మెరుగైన చికిత్స కోసం అనంతపురంలోని హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదానికి సంబంధించిన ఇతర వివరాల్లోకి వెళితే..

ఆదివారం తెల్లవారుజామున అనంతపురం జిల్లా పామిడి మండలం పొగురూరు దగ్గర జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. పొగూరూరు వద్ద బ్రిడ్జిపై ప్రైవేట్ ట్రావెల్స్ బస్సును ఐషర్ వాహనం ఢీట్టింది. రెండు పరస్పరం ఢీకొట్టుకోవడంపై బ్రిడ్జిపైనుంచి కింద పడ్డాయి. దీంతో బస్సులోని 20 ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయని అధికారులు తెలిపారు. ఈ రోడ్డు ప్రమాదానికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు, అధికారులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే ఈ ప్రమాదం కారణంగా నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో కాసేపు వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయితే పోలీసులు ట్రాఫిక్‌ను క్లియర్ చేశారు. పోలీసులు ఈ ప్రమాదంపై కేసు నమోదు నమోదు చేసుకుని దర్యాప్తు చేపడుతున్నారు. ప్రమాదం ఎలా జరిగిందనే కోణంలో విచారణ చేపడుతున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *