రోహిణి అన్నం తినకుండా అత్త ప్రభావతి సూటిపోటి మాటల్ని గుర్తుచేసుకుని బాధపడుతుంది. మనోజ్ నీకు ఫోన్ చేయలేదా? ఫ్రెండ్ విద్య అడుగుతుంది. తను చేయకపోతేనేం ఈగోను పక్కనపెట్టి నువ్వు ముందు చేయి. తప్పు నువ్వు చేసావు. ప్రేమ అనే బంధం ముఖ్యం అని నీకు అనిపిస్తే నువ్వే ముందు ఫోన్ చేయి అంటుంది విద్య. పరిస్థితి ఏంటి ఎలా ఉన్నాడో బాధపడుతుంది రోహిణి. ఫోన్ చేయబోయి కింద పెట్టేస్తుంది. మరో వైపు బార్‌లో ఫుల్‌గా మందు కొడతాడు మనోజ్. ఫ్రెండ్ సత్యంతో బైక్ మీద ఇంటికొస్తూ పోలీసులతో గొడవ పడతాడు. లేడీ కానిస్టేబుల్ పేరు రోహిణి కావడంతో ఆమెను తన భార్య రోహిణిగా భావించి వేధిస్తుంటాడు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్లి పోలీసులు నైట్ అంతా కూర్చోబెడతారు. పొద్దున్నే లేచి .. తన చొక్కాని తనే విప్పేసుకుని.. చొక్కా లేకుండా కూర్చోబెడతార్రా.. పోలీసుల అరాచకాన్ని ఖండిస్తున్నాను.. పోలీసుల దౌర్జన్యం నశించాలి .. అంటూ అరుస్తూ మనోజ్ గోల చేస్తుంటాడు. తాగిన మైకం ఇంకా దిగకపోవడంతో స్టేషన్‌లో ఇష్టమొచ్చినట్లు వాగుతూ న్యూసెన్స్ క్రియేట్ చేస్తుంటాడు. నా కాపురాన్ని కూల్చేట్టు ఉన్నాడు… మనోజ్‌పై రైఫిల్ ఎక్కుపెట్టి షూట్ చేయాలని చూస్తుంది కానిస్టేబుల్ రోహిణి.
ఎక్కువ మంది చదివినవి : Cinema : ఓటీటీలో దుమ్మురేపుతున్న సస్పెన్స్ థ్రిల్లర్.. 3 ఏళ్లుగా ట్రెండ్ అవుతున్న క్రైమ్ సిరీస్..
Gunde Ninda Gudi Gantalu Se
మనోజ్ ఫ్రెండ్ మణికంఠ బాలు ఇంటికొస్తాడు. పోలీస్ స్టేషన్‌లో మనోజ్ ఉన్నాడని తండ్రి సత్యం, తమ్ముడు బాలుకి చెబుతాడు. ఇంట్లో ఉండి ఆ టెన్షన్ తట్టుకోలేను .. నేను కూడా వస్తా అని తండ్రి సత్యం, బాలుతో స్టేషన్‌కి వెళతాడు. ఎస్‌ఐ అరుణ్ బాలుని చూసి గతంలో బాలు తనతో గొడవకు దిగిన సీన్ గుర్తొచ్చి షాకవుతాడు. తన పై కోపంతో తమ్ముడు మనోజ్‌ని అరెస్ట్ చేసారా అని ఎస్‌ఐతో బాలు వాదిస్తాడు. నువ్వు ఇతని అన్న అన్న విషయం నాకిప్పుడే తెలిసింది అంటాడు అరుణ్. నీలా మీ ఇంట్లో అందరూ రౌడీలేనా అంటాడు. మనోజ్ పోలీసులపై చేయి చేసుకున్నాడు కేసు పెట్టాం. కోర్లుకి వచ్చి తేల్చుకోండి అంటాడు ఎస్‌ఐ అరుణ్.
ఎక్కువ మంది చదివినవి : Jason Sanjay: ఇద్దరి మధ్య ఎప్పుడూ గొడవలే.. దూరమయ్యాకే విలువ తెలిసింది.. విజయ్ దళపతి కొడుకు జాసన్ సంజయ్..
Gunde Ninda Gudi Gantalu Te
ఒక తండ్రిగా కొడుకును ఇంత దీనస్థితిలో చూడలేకపోతున్నా అని ఎస్సై అరుణ్‌తో మనోజ్ తండ్రి సత్యం అంటాడు. అది చూసి తట్టుకునే శక్తి తనకు లేదనీ మనోజ్‌ని వదిలేయాలని వేడుకుంటాడు. సత్యం క్షమాపణ చెప్పి కన్నీళ్లు పెట్టుకోవడం చూస్తున్న పై అధికారి ఎస్సై అరుణ్‌ని పిలుస్తాడు. ఎఫ్‌ఐఆర్ రాయలేదా అంటాడు. లేదు సార్ అంటాడు అరుణ్. మొదటిసారి తాగిన వాళ్లు ఇలాగే గొడవ చేస్తారు. ఆ తండ్రి బాధని చూస్తే జాలేస్తుంది.. పంపించేయ్ అంటాడు. పోలీసులు నాకింకా సారీ చెప్పలేదు.. నేను రాను .. అంటాడు మనోజ్. నాకు చెప్పార్రా అంటాడు తండ్రి. మనోజ్‌ని ఇంటికి తీసుకెళతారు బాలు, సత్యం. అక్కడితో ఈ రోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
ఎక్కువ మంది చదివినవి : Tollywood : గ్లామర్ సీన్స్ చేస్తానని ఏడ్చేశాను.. నాకెందుకు అలాంటి సీన్స్ రాలేదు.. టాలీవుడ్ హీరోయిన్..
ఎక్కువ మంది చదివినవి : Cinema : రూ.150 కోట్లు పెట్టి పరమ చెత్త సినిమా తీశారు.. ఇండస్ట్రీలో అతిపెద్ద డిజాస్టర్.. ఇప్పటికీ కోలుకోని నిర్మాత..