Headlines

Tollywood : బ్లాక్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్స్.. గ్లామర్ స్టైల్ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? | Lenin Movie Actress Bhagyashri Borse Latest Black Stunning Outfit Look and Her Swag Goes Viral

Tollywood : బ్లాక్ అవుట్‌ఫిట్‌లో స్టన్నింగ్ లుక్స్.. గ్లామర్ స్టైల్ చూసి ఫిదా అవుతున్న ఫ్యాన్స్.. ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.. ? | Lenin Movie Actress Bhagyashri Borse Latest Black Stunning Outfit Look and Her Swag Goes Viral


పైన ఫోటోలో కనిపిస్తున్న ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? బ్లాక్ ఆవుట్‌ఫిట్‌లో గ్లామరస్ గా కనిపిస్తూనే సింపుల్ లుక్‌లోనే మతులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇన్నాళ్లు ట్రెడిషనల్ లుక్కులో ఎంతో క్యూట్ గా కనిపించిన ఈ అమ్మడు.. మోడ్రన్ గ్లామరస్ బ్యూటీగా కనిపించడం చూసే ఫిదా అవుతున్నారు ఫ్యాన్స్. తాజాగా ఈ అమ్మడు ఎయిర్ పోర్టులో కనిపించిన వీడియోస్, ఫోటోస్ నెట్టింట వైరల్ గా మారాయి. దీంతో తమ హీరోయిన్ లేటేస్ట్ సింపుల్ లుక్, స్వాగ్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్. పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ మరెవరో కాదు హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సే. ఇటీవల అక్కినేని అఖిల్ సరసన లెనిన్ చిత్రంతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. భారీ హైప్ మధ్య విడుదలైన ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ ఊహించని స్థాయిలో దూసుకుపోయింది. తాజాగా ఈ అమ్మడు ఎయిర్ పోర్టులో తన స్వాగ్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. తన క్యూట్ స్మైల్, విలక్షణమైన ఫ్యాషన్ సెన్స్ తో కుర్రకారు హృదయాలు కొల్లగొట్టింది. ఇందుకు సంబంధించిన ఫోటోస్, వీడియోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Krishna Vamsi: అతడిని డైరెక్టర్ చేయాలని సినిమా స్టార్ట్ చేశా.. ఎంతో ఫోర్స్ చేశా.. కానీ ఇప్పుడు పెద్ద నటుడు అయ్యాడు.. కృష్ణ వంశీ..

ఈ స్టార్ బ్యూటీ ఆల్-బ్లాక్ మినిమల్ అవతార్‌లో మెరిసింది. నల్లటి క్యూట్ ఫిటెడ్ డ్రెస్, దానికి తగ్గట్టుగా బ్లాక్ క్యాప్, స్పోర్టీ స్నీకర్స్, ఇయర్ ఫోన్స్ ధరించి చాలా సింపుల్ అండ్ స్టైలిష్ లుక్‌లో కనిపించింది. ఎటువంటి హడావుడి లేకుండా, చాలా క్యాజువల్ అవుట్ ఫిట్ లో ఉన్నప్పటికీ తన సహజసిద్ధమైన గ్లామర్‌తో స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది. కెమెరాల ముందుకు రాగానే ఎంతో చిరునవ్వుతో ముందుకు సాగింది. సిల్వర్ స్క్రీన్ పైనే కాకుండా రియల్ లైఫ్‌లోనూ ఈ భామ చూపించే ఫ్యాషన్ స్టేట్‌మెంట్లకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ‘మిస్టర్ బచ్చన్’ చిత్రంతో తెలుగు చిత్రసీమలోకి అడుగుపెట్టి తన నటనతో, అందంతో గ్లామర్ ప్రియులను కట్టిపడేసిన ఈ సుందరి, వరుస అవకాశాలతో టాలీవుడ్‌లో వేగంగా క్రేజ్ సంపాదించుకుంటోంది.

ఎక్కువ మంది చదివినవి : రోజుకు 15000 అడుగులు నడుస్తా.. టిఫిన్లు అస్సలు చేయను.. 86 ఏళ్ల వయసులో ఇంత ఫిట్‏గా.. మురళీ మోహన్ డైట్ సీక్రెట్ ఇదే..

ప్పటికప్పుడు సరికొత్త అవుట్‌ఫిట్లతో మెరిసిపోతూ సోషల్ మీడియాలో తనకంటూ ప్రత్యేక ఫాలోయింగ్‌ను ఏర్పరచుకుంది. తాజాగా ఈ అమ్మడు లుక్ చూసి ఫ్యాన్స్ క్రేజీగా రెస్పాండ్ అవుతున్నారు. “బ్లాక్ డ్రెస్‌లో క్యూట్‌గా ఉంది”, “స్టైలిష్ అండ్ గార్జియస్ లుక్” అంటూ రకరకాల కామెంట్లతో కాంమెంట్ల వర్షం కురిపిస్తున్నారు. ప్రస్తుతం యంగ్ హీరోల సినిమాలతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, రాబోయే ప్రాజెక్టులతో బాక్సాఫీస్ వద్ద మరిన్ని విజయాలు అందుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Bigg Boss 10 Telugu : బి‏గ్ బాస్‏లో జబర్దస్త్ క్రేజీ బ్యూటీ.. ఆఫర్ రావడంపై స్పందించిన గ్లామరస్ క్వీన్.. ఏమన్నారంటే..

భాగ్య శ్రీ బోర్సే వీడియో..

ఎక్కువ మంది చదివినవి : Aishwarya Rajesh: అతడంటే క్రష్ కాదు పిచ్చి ఇష్టం.. తన కోసం చాలా ట్రై చేశా.. కానీ అంతలోనే తిరిగిరాని లోకాలకు.. ఐశ్వర్య రాజేశ్..



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *