Headlines

అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు.. వల్గర్ వీడియోలు చేస్తావ్ అంటూ మాట్లాడారు : ఉప్పల్ బాలు

అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు.. వల్గర్ వీడియోలు చేస్తావ్ అంటూ మాట్లాడారు : ఉప్పల్ బాలు


అగ్నిపరీక్షకు పిలిచి అవమానించారు.. వల్గర్ వీడియోలు చేస్తావ్ అంటూ మాట్లాడారు : ఉప్పల్ బాలు

బిగ్ బాస్ సీజన్ 10 ప్రారంభం కావడానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే అగ్నిపరీక్ష సెలక్షన్స్ మొదలు పెట్టేశారు. ఈసారి సామాన్యులకు పెద్ద పీట వేసేలా ప్లాన్ చేశారు బిగ్ బాస్ టీమ్. గత సీజన్ లోనూ కామనర్స్ హౌస్ లో రాణించారు. సామాన్యుడిగా వెళ్లిన కళ్యాణ్ ఏకంగా విన్నర్ గా నిలిచాడు. దాంతో ఈసారి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి సామాన్యులు పెద్దెత్తున ఆసక్తి చూపిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజాగా జరిగిన అగ్నిపరీక్ష ఆడిషన్స్ లో ప్రముఖ యూట్యూబర్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఉప్పల్ బాలు కూడా హాజరయ్యాడు. అయితే అతనికి సంబందించిన ప్రమోను కూడా తాజాగా విడుదల చేశారు బిగ్ బాస్ టీమ్. అయితే ఈ ఆడిషన్స్ లో ఉప్పల్ బాలు సెలక్ట్ కాలేదని తెలుస్తుంది.

ఇది కూడా చదవండి: అమ్మబాబోయ్..! మేడం ఇది మీరేనా..!! సింధుతులాని ఇప్పుడు ఎంత మారిపోయింది

ఆడిషన్స్ నుంచి రిజెక్ట్ అయిన తర్వాత ఉప్పల్ బాలు సోషల్ మీడియాలో ఓ వీడియోను షేర్ చేశాడు. సామాన్యుడిగా, మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన తాను ఎంతో కష్టపడి పైకి వచ్చాను అని తెలిపాడు. అలాగే మిడిల్ క్లాస్ వాళ్లకు ఎదిగే అవకాశం ఇవ్వడంలేదని.. తన వీడియోలు వల్గర్‌గా ఉంటున్నాయి అంటూ రిజెక్ట్ చేశారని బాలు అవేధ వ్యక్తం చేశాడు. ఎంతో కష్టపడి అగ్నిపరీక్షలో అన్ని పాస్ అవుతూ వచ్చిన తనకు చివరి నిమిషంలో ఎలాంటి టాస్క్ కానీ గేమ్ కానీ ఇవ్వకుండా మీ వీడియోలు వల్గర్‌గా ఉంటాయి.. మీ వీడియోలు దేనికి పనికొస్తాయి.? అని అడిగారని తెలిపాడు.

ఇది కూడా చదవండి :అయ్యో.. ఫోన్ ఎంతపని చేసింది..!! హాస్పటల్ పాలైన అందాల నటి.. కారణం తెలిస్తే షాక్ ఆడుతారు

అలాగే నవదీప్ గురించి మాట్లాడుతూ.. నన్ను అన్నారు కదా మరి మీ వీడియోలు దేనికి పనికొస్తాయండి.? మీరు ఎవరికైనా దానం చేశారా.? ఎవరికైనా డబ్బు సాయం చేశారా.? మేము మిడిల్ క్లాస్ వాళ్లం.. ఏం చేయలేము.. అని అనుకుంటున్నారు. మీకు అవకాశం ఇచ్చారు కాబట్టే మీరు అక్కడ కూర్చున్నారు. అదే అవకాశం ఇవ్వకపోతే వెళ్లరు కదా.? అని ప్రశ్నించాడు ఉప్పల్ బాలు. అగ్నిపరీక్షకు పిలిచి అవమానించడం కాదు.. దీనిని నేను అస్సలు వదిలిపెట్టను.. పాపం అనేది కచ్చితంగా తగులుతుంది.. నాకు న్యాయం జరగాలి అంటూ ఉప్పల్ బాలు చేసిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇది కూడా చదవండి :జెన్ జీలకు తెగ నచ్చేసిన సినిమా ఇదే.. ఒక్కసారి చూస్తే మీరూ వదిలిపెట్టారు.!

 

View this post on Instagram

 

A post shared by uppal balu (@uppalbaluofficial)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *