టాలీవుడ్‌లో ఇప్పుడు ఓ యంగ్ బ్యూటీ సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. వరుస సక్సెస్‌లు ఈ బ్యూటీ క్రేజ్‌ను నెక్ట్స్ లెవల్‌కు తీసుకెళుతున్నాయి. చేసిన ప్రతి సినిమాతో హిట్స్ కొడుతూ ఇండస్ట్రీలో ‘గోల్డెన్ హ్యాండ్’గా మారిపోయారు ఆ బ్యూటీ. తన క్యూట్ లుక్స్, పర్‌ఫార్మెన్స్‌తో ఆడియన్స్‌ను ఎట్రాక్ట్ చేస్తూ విన్నింగ్ స్ట్రీక్‌ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇంతకీ ఎవరా బ్యూటీ అనుకుంటున్నారా.. అయితే వాచ్ దిస్ స్టోరి. అశోకవనంలో అర్జున కల్యాణం సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన బ్యూటీ రితికా నాయక్. తొలి మూవీతోనే తన న్యాచురల్ యాక్టింగ్‌తో పాటు అందంతోనూ మంచి పేరు తెచ్చుకున్నారు ఈ బ్యూటీ. ఆ తరువాత హాయ్ నాన్న మూవీలో క్యామియో రోల్ చేసినా తన మార్క్ చూపించారు. ఇక తేజ సజ్జాతో చేసిన ‘మిరాయ్’ మూవీ అమ్మడి కెరీర్‌కు సూపర్ బూస్ట్ ఇచ్చింది. వరుసగా చేసిన సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర హిట్ అవ్వడంతో టాలీవుడ్‌లో లక్కీ ఛార్మ్‌గా మారిపోయారు రితికా. ఒకే తరహా పాత్రలు కాకుండా ప్రతి సినిమాలోనూ కొత్తదనం చూపిస్తూ విమర్శకుల ప్రశంసలు అందుకుంటున్నారు. అదే సమయంలో వరుస సక్సెస్‌లతో కెరీర్లో స్పీడ్ చూపిస్తున్నారు. దీంతో టాలీవుడ్‌లో అమ్మడికి మరిన్ని అవకాశాలు క్యూ కట్టాయి. రీసెంట్‌గా రిలీజ్ అయిన ‘కొరియన్ కనకరాజు’ మూవీతో రితికా కెరీర్‌కు మరో సక్సెస్ ఇచ్చింది. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ డైరెక్షన్‌లో వచ్చిన ఈ మూవీకి సాలిడ్ పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. ఈ మూవీలో మోడ్రన్, బబ్లీ క్యారెక్టర్ లో తన పెర్ఫార్మెన్స్‌తో ఫిదా చేశారు రితికా. ప్రజెంట్ ఈ బ్యూటీ ఫోకస్ అంతా టాలీవుడ్ మీదే ఉంది. సినిమాల ఎంపికలో ఆచితూచి అడుగులు వేస్తున్న రితికా, ఫ్యూచర్ ప్రాజెక్ట్స్‌తో స్టార్ స్టేటస్‌ను టార్గెట్ చేస్తున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Dhurandhar: థియేటర్లలో వేల కోట్లు.. ఇప్పుడు ఓటీటీలోనూ వరల్డ్ రికార్డ్! ‘ధురంధర్’ దుమ్మురేపుతోంది
పిల్లల చేతికి మొబైల్ ఇస్తున్నారా? అయితే.. మీ బ్యాంకు ఖాతా ఖాళీ!
ఈ చిన్నారి చిచ్చరపిడుగు.. ఏకంగా విమానాన్నే రద్దు చేయించింది!
కడుపు నిండా తింటూనే బరువు తగ్గొచ్చు.. ట్రెండింగ్‌లో ‘వాల్యూమెట్రిక్స్ డైట్’!
భోజనం చేసిన వెంటనే పండ్లు తినొచ్చా? నిపుణులు చెబుతున్న అసలు నిజం ఇదే!