Headlines

Gold Price: బంగారం రూ.3 లక్షలు.. వెండి రూ.6 లక్షలు దాటుతుందా..? మరో సంచలన ప్రకటన..! | Latest gold price prediction rs 3 lakh gold and rs 6 lakh silver robert kiyosaki big forecast


Gold, Silver Prices: ‘రిచ్ డాడ్, పూర్ డాడ్’ అనే ప్రసిద్ధ పుస్తక రచయిత, పెట్టుబడిదారుడైన రాబర్ట్ కియోసాకి బంగారం, వెండికి సంబంధించి మరోసారి ఒక సంచలన ప్రకటన చేశారు. సమీప భవిష్యత్తులో 10 గ్రాముల బంగారం ధర రూ.3 లక్షలు, కిలోగ్రాము వెండి ధర రూ.6 లక్షలు దాటవచ్చని కియోసాకి భావిస్తున్నారు. కియోసాకి ఈ సంచలన అంచనా, అమెరికా ఆకాశాన్నంటుతున్న జాతీయ రుణంతో ముడిపడి ఉంది. అమెరికా జాతీయ రుణం త్వరలోనే $40 ట్రిలియన్లకు చేరుకోవచ్చని ఆయన హెచ్చరించారు. ఈ నెల అంటే ఆగస్టులో బంగారం లేదా వెండిపై పందెం వేయడం తెలివైన పనా కాదా అనే దానిపై కూడా కియోసాకి వివరించారు.

ఒక క్రాస్-పోస్ట్‌లో కియోసాకి ఇలా రాశారు. తన సన్నిహిత మిత్రుడు ప్రఖ్యాత ఆర్థిక వ్యాఖ్యాత అయిన జిమ్ రికార్డ్స్ అంచనా ప్రకారం, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ధర ఔన్సుకు $10,000 డాలర్లకు చేరవచ్చు. వెండి ధరలు కూడా ఔన్సుకు $200 డాలర్లకు చేరవచ్చు. ఒక ఔన్సులో 31.1035 గ్రాములు ఉంటాయి. దీనిని పరిగణనలోకి తీసుకుంటే, భారత మార్కెట్‌లో 10 గ్రాముల బంగారం ధర సుమారుగా రూ.3.06 లక్షలు, కిలోగ్రాము వెండి ధర సుమారుగా
రూ.6.13 లక్షలు ఉండవచ్చన్నారు.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి: Hyderabad Water Supply: హైదరాబాద్‌ వాసులకు బిగ్‌ అలర్ట్‌.. సోమవారం ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్‌

ఆగస్టు 2026లో వెండి ఉత్తమ ఎంపిక

రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి ధరలు బలంగా పెరుగుతాయని అంచనా వేశారు. కానీ ఈ నెలలో పెట్టుబడిదారులు వెండిలో పెట్టుబడి పెట్టాలని కూడా ఆయన సలహా ఇచ్చారు. X లో పంచుకున్న ఒక పోస్ట్‌లో ఆగస్టు 2026 నాటి ప్రస్తుత పరిస్థితులలో బంగారం కంటే వెండి ఒక మెరుగైన, అధిక రాబడినిచ్చే ఎంపిక అని తాను భావిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.

ఫియట్ కరెన్సీని కలిగి ఉన్నవారిని కియోసాకి మరోసారి హెచ్చరించారు. ద్రవ్యోల్బణం, విచ్చలవిడిగా కరెన్సీ ముద్రణ జరుగుతున్న ఈ సమయంలో, నగదును నిల్వచేసుకునేవారే అంతిమంగా అత్యధిక నష్టాలను చవిచూస్తారని ఆయన పునరుద్ఘాటించారు. పెరుగుతున్న అమెరికా అప్పులు, తగ్గుతున్న కొనుగోలు శక్తి నేపథ్యంలో, తాము కష్టపడి సంపాదించిన డబ్బును, ఆస్తులను కాపాడుకోవడానికి పెట్టుబడిదారులు ఎలాంటి నిర్దిష్ట చర్యలు తీసుకుంటున్నారని ఆయన ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: Traffic Lights: ట్రాఫిక్ లైట్లలో ఎరుపు, పసుపు, ఆకుపచ్చ రంగులనే ఎందుకు ఉపయోగిస్తారు? దీని వెనుక శాస్త్రీయ కారణాలు ఇవే!

భారతదేశంలో గత ట్రేడింగ్ సెషన్‌లో 10 గ్రాముల 24-క్యారెట్ల బంగారం ధర రూ.1,56,200గా ఉండగా, కిలోగ్రాము వెండి ధర రూ.2,40,000గా ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర ఔన్సుకు $4,351.01 వద్ద స్వల్పంగా తగ్గి ముగిసింది. వెండి ధరలు 0.33% పెరిగి ఔన్సుకు $64.68కి చేరాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *