చిత్రపరిశ్రమలో రాణించడం అంత సులభం కాదు.. వరుసగా సినిమాలు చేసి కనిపించకుండా పోయిన హీరోయిన్స్ ఉన్నారు. అలాగే ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో రాణిస్తున్న ముద్దుగుమ్మలు కూడా ఉన్నారు. ఇక ఇండస్ట్రీలో హిట్స్, ఫ్లాప్స్ అనేవి చాలా కామన్. హీరోలు, హీరోయిన్స్ చాలా మంది హిట్స్, ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నారు. కొంతమంది మాత్రం ఫ్లాప్స్ వస్తే కనిపించకుండా పోతారు.
సినిమాలు ఫ్లాప్ అయితే చాలు ఐరెన్ లెగ్ అని ముద్ర వేసేస్తారు. మెల్లమెల్లగా సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతాయి.. క్రమంగా ఇండస్ట్రీలో కనిపించకుండాపోతారు.. కానీ ఈ హీరోయిన్ రూటే సపరేట్.. 15ఏళ్లుగా ఒక్క హిట్ అందుకోలేకపోయింది.. ఇరవై ఏళ్లకు పైగా సినీ ఇండస్ట్రీలో ఉంది ఈ ముద్దుగుమ్మ. అలాగే 15 ఏళ్లుగా హిట్స్ మాత్రం అందుకోలేకపోయింది. కానీ ఆమె క్రేజ్ మాత్రం ఎక్కడ తగ్గలేదు.
ఆమె మరెవరో కాదు.. బాలీవుడ్ క్రేజీ బ్యూటీ చిత్రాంగదా సింగ్. ఈ అమ్మడి గురుంచి అందరికి తెలిసిందే. అందేలా భామ చిత్రాంగదా రాజస్థాన్‌లోని జోధ్‌పూర్‌లో జన్మించి, అక్కడే పెరిగింది. బాలీవుడ్ సినిమాలతో పాపులర్ అయ్యింది. 2005లో హజారోన్ ఖ్వైషీన్ ఐసీ అనే క్రైమ్ డ్రామాతో సినీ రంగంలోకి అడుగుపెట్టింది. మోడలింగ్ నుంచి హీరోయిన్ గా మారింది ఈ చిన్నది.
హీరోయిన్ గానే కాదు నిర్మాతగానూ చేసింది. 2018లో సూర్మా అనే స్పోర్ట్స్ డ్రామాకు నిర్మాతగా వ్యవహరించింది. సినీ కెరీర్ లో చిత్రాంగదా సింగ్ తొమ్మిదేళ్ల పాటు సినిమాలకు దూరంగా ఉంది. ఆ సమయంలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ మిస్ చేసుకుంది. అలాగే ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఆసక్తికర కామెంట్స్ చేసింది. కెరీర్ లో నేను ఎన్నో తప్పులు చేశాను అని చెప్పుకొచ్చింది.
నేను ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలను మిస్ చేసుకున్నా.. గ్యాంగ్‌స్టర్ సినిమా కూడా నేను రిజెక్ట్ చేశా.. అంతే కాదు తను వెడ్స్ మను సినిమాను కూడా నేను మిస్ చేసుకున్నా.. మంగల్ పాండే’లో అమీషా పటేల్ చేసిన పాత్రకు కూడా నేను నో చెప్పా.. అని తెలిపింది. సినిమాలు నిరాశపరిచినప్పటికీ ఆమె నటనకు ఎప్పుడూ మంచి మార్కులే పడ్డాయి. కానీ కమర్షియల్‌గా పెద్ద హిట్స్ లేకపోవడం ఆమె కెరీర్‌కు మైనస్‌గా మారింది.




