Headlines

RBI: కేవైసీ అప్‌డేట్ చేయకపోతే బ్యాంకు ఖాతా బ్లాక్ అవుతుందా? ఆర్‌బిఐ కీలక అప్‌డేట్..! | Bank Account KYC Fraud Update: Will Your Account Be Blocked If You Don’t Complete KYC? RBI Clarifies About this fraud message


Bank KYC Updates: ‘ఇప్పుడే మీ కేవైసీని అప్‌డేట్ చేసుకోండి, లేకపోతే మీ ఖాతా బ్లాక్ చేయబడుతుంది’ వంటి సందేశం మీకు కూడా వచ్చిందా? అయితే చాలా జాగ్రత్తగా ఉండండి. కేవైసీ అప్‌డేట్‌కు సంబంధించిన మోసాల గురించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెచ్చరించింది.

ఎవరికైనా అలాంటి సందేశాలు వస్తే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రిజర్వ్ బ్యాంక్ తెలిపింది. భయపడాల్సిన పనిలేదు. ఇవి మోసపూరిత సందేశాలు. మీకు అలాంటి సందేశాలు వస్తే, ఎలాంటి లింక్‌పైనా క్లిక్ చేయడం మానుకోండి. మోసగాళ్ల పట్ల అప్రమత్తంగా ఉండేందుకు, వినియోగదారులు పలు విధానాలను పాటించాలని ఆర్బీఐ కోరుతోంది.

అలాంటి సందేశం వస్తే, తొందరపడి ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఆర్‌బిఐ చెబుతోంది. ఎందుకంటే బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు (ఎన్‌బిఎఫ్‌సిలు) కేవైసి అప్‌డేట్ కోసం లింక్‌లను పంపవు. అలాంటి సందేశం వస్తే, అటువంటి లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయవద్దు. ఒకవేళ ఏదైనా ఓటిపి, పిన్, పాస్‌వర్డ్ అడిగితే వాటిని ఎప్పుడూ పంచుకోవద్దని ఆర్‌బిఐ చెబుతోంది. మరిన్ని వివరాల కోసం, https://m.rbi.org.in/FinancialEducation/ పై క్లిక్ చేయమని ఆర్‌బిఐ సిఫార్సు చేస్తోంది.

ఇవి కూడా చదవండి



ఇది కూడా చదవండి: Biryani Recipe: వారి జీవితాన్నే మార్చేసిన అమ్మమ్మ బిర్యానీ రెసిపీ.. రూ.5 లక్షల పెట్టుబడితో రూ.10 కోట్ల వ్యాపారం.. అక్కాచెల్లెళ్ల సక్సెస్‌ స్టోరీ

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *