Headlines

Bigg Boss Telugu 10: బిగ్‌బాస్‌తో గంగవ్వకు మొత్తం ఎంత డబ్బు వచ్చిందో తెలుసా? ఆసక్తికర విషయాలు బయటపెట్టిన అంజిమామ | Bigg Boss Telugu 10: Anji Mama Talks About How Gangavva Life Has Been Changed With Nagarjuna Reality Show


గంగవ్వ.. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు తెలియని వారుండరంటే అతి శయోక్తి కాదు. ముఖ్యంగా సోషల్ మీడియాను అనుసరించే వారికి ఈ ముసలావిడ బాగా పరిచయం. ‘ మై విలేజ్ షో’ ద్వారా గంగవ్వ పండించిన కామెడీ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా తెలంగాణ యాసలో ఆమె చెప్పే మాటలు, డైలాగులకు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ఈ క్రేజ్ తోనే బిగ్ బాస్ తెలుగు రియాలిటీ షోలోకి కంటెస్టెంట్ గా వెళ్లారు గంగవ్వ. అది కూడా ఒకసారి కాదు రెండు సార్లు. 2020లో బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లోకి ప్రధాన కంటెస్టెంట్ గా వెళ్లారామె. .నాగార్జున హోస్ట్ చేసిన ఆ సీజన్‌లో గంగవ్వ మాట్లాడే విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. వయసు, శరీరం సహకరించకపోయనా ఫిజికల్ టాస్కుల్లో ఆమె పోటీ పడిన తీరు అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆరోగ్య కారణాలతో ఆమె షో నుంచి మధ్యలోనే బయటకు వచ్చినా.. అప్పటికే ప్రేక్షకుల మనసుల్లో చెరగని స్థానం సంపాదించుకున్నారు గంగవ్వ. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ ద్వారా గంగవ్వ జీవితం లో వచ్చిన మార్పులపై మై విలేజ్ షో ఫేమ్ అంజిమామ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. ‘ గంగవ్వకు ముందు నుంచే మై విలేజ్ షో ద్వారా మంచి గుర్తింపు ఉంది. అయితే 2020లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 4లోకి వెళ్లిన తర్వాత ఆమె పాపులారిటీ మరింత పెరిగింది. ఈ షోలో నాగార్జున గంగవ్వకు రూ.7 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బును గంగవ్వ తన కోసం దాచుకోవడం కంటే ఇంటి కోసమే ఎక్కువగా ఖర్చు పెట్టింది’ అని చెప్పుకొచ్చారు అంజిమామ. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా 2024లో ప్రసారమైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లోనూ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ గా పార్టిసిపేట్ చేశారు గంగవ్వ. అప్పుడు కూడా వయసు సహకరించకపోయినా ఫిజికల్ టాస్కుల్లో అదరగొట్టారు బామ్మగారు. మొత్తం ఐదు వారాల పాటు హౌస్ లో ఉన్న ఆమె అనారోగ్యం కారణంగా బయటకు వచ్చేశారు. కాగా బిగ్ బాస్ తర్వాత గంగవ్వ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. టీవీ షోలతో పాటు సినిమాల్లోనూ ఆమెకు అవకాశాలు వచ్చాయి. మల్లేశం, ఇస్మార్ట్ శంకర్, ఎస్ ఆర్ కల్యాణ మండపం, రాజ రాజ చోర, లవ్ స్టోరీ, ఇంటింటి రామాయణం, కిస్మత్, భరత నాట్యం.. ఇలా చాలా సినిమాల్లో కమెడియన్ గా, సహాయక నటిగా మెరిశారు గంగవ్వ.

ఇవి కూడా చదవండి



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *