Headlines

Free Online Coaching: ఉచిత ఆన్‌లైన్ కోచింగ్ ప్లాట్‌ఫామ్‌పై విద్యాశాఖ సమీక్ష.. పోటీ పరీక్షల అభ్యర్థులకు డిజిటల్ ఊరట | Education Minister Joshi Reviews Implementation Of Prime Minister’s Free Online Coaching Initiative


Free Online Coaching: దేశంలో వివిధ పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న యువతకు ఉచితంగా ఆన్‌లైన్ కోచింగ్ అందించాలనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆలోచనను వేగవంతం చేసేందుకు చర్యలు ప్రారంభమయ్యాయి. ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమం అమలు పురోగతిపై కేంద్ర విద్యాశాఖ ఉన్నతాధికారులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. దేశంలోని ప్రతి విద్యార్థికీ నాణ్యమైన విద్య, నైపుణ్య శిక్షణ అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం ఈ వినూత్న నిర్ణయం తీసుకుంది.

జాతీయ స్థాయి డిజిటల్ వేదిక:

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం ఒక బలమైన జాతీయ స్థాయి డిజిటల్ వేదికను రూపొందించడంపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. అయితే సబ్జెక్ట్ నిపుణులు రూపొందించిన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంటుంది. ఉచితంగా నాణ్యమైన కంటెంట్ అందించనున్నారు. వివిధ రంగానికి చెందిన నిపుణుల ద్వారా సలహాలు, సందేహాల నివృత్తికి అవకాశం లభిస్తుంది. పరీక్షల సిలబస్‌కు అనుగుణంగా ప్రామాణికమైన, ప్రణాళికాబద్ధమైన శిక్షణను అందిస్తారు.

రూరల్ అభ్యర్థులకు గొప్ప అవకాశం:

గ్రామీణ, ఆర్థికంగా వెనుకబడిన ప్రాంతాలకు చెందిన విద్యార్థులు ఖరీదైన ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్న తరుణంలో, ఈ ఉచిత డిజిటల్ ప్లాట్‌ఫామ్ వారికి ఎంతో మేలు చేస్తుందని భావిస్తున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న అర్హులైన అభ్యర్థులందరికీ సమాన అవకాశాలు కల్పించడమే ఈ ప్రాజెక్ట్ ముఖ్య ఉద్దేశం. త్వరలోనే ఈ ప్లాట్‌ఫామ్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, అందుబాటులోకి వచ్చే కోర్సులు, నమోదు ప్రక్రియను విద్యాశాఖ వెల్లడించనుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి



Leave a Reply

Your email address will not be published. Required fields are marked *