Headlines

OTT Movie: అడవిలో అదృశ్య శక్తి.. ఓటీటీలో దుమ్మురేపుతోన్న మలయాళం సర్వైవల్ థ్రిల్లర్.. తెలుగులోనూ ఉంది | Malayalam Psychological Survival Thriller Forest Guard Movie Trending Top On Aha OTT


ఓటీటీలో మలయాళం సినిమాలకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా హారర్, క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ జానర్ సినిమాలకు ఆడియెన్స్ నుంచి ఆదరణ ఎక్కువగా ఉంటోంది. ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఒక మలయాళం సినిమానే. ఇదొక సర్వైవల్ క్రైమ్ థ్రిల్లర్. గత వారమే మలయాళంతో సహా వివిధ భాషల్లో ఓటీటీలోకి వచ్చేసింది. ఆద్యంతం ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠరేపే సన్నివేశాలు, ఊహించని ట్విస్టులతో సాగిపోయే ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. పైగా ఈ సినిమా నిడివి కూడా తక్కువే. కేవలం సుమారు 2 గంటల 6 నిమిషాల రన్‌టైమ్‌తో ఈ మూవీ సాగుతుంది. స్టోరీ విషయానికి వస్తే.. మిథున్ (కథిర్) దట్టమైన అటవీ ప్రాంతంలో ఫారెస్ట్ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తుంటాడు. ఒకరోజు తన పాత మిత్రులు ఆనంద్, ఇమ్మాన్యుయేల్ లను విందుకు పిలుస్తాడు. ప్రత్యేకంగా జింక మాంసంతో రుచికరమైన విందు సిద్ధం చేయిస్తానని చెబుతాడు. అయితే ఆనంద్ మాత్రం ఈ విషయాన్ని స్థానిక రాజకీయ నాయకుడు రఘకు చెబుతాడు. మిథున్ జింక మాంసం వండిన వెంటనే సమాచారం అందిస్తే, చట్టవిరుద్ధంగా వేటాడిన నేరంపై అతనిని పోలీసులకు పట్టించి జైలుకు పంపవచ్చని రఘు ప్లాన్ వేస్తాడు.

మరోవైపు అదే గ్రామానికి చెందిన కృష్ణ తన తండ్రి అంత్యక్రియలను అత్యంత ఘనంగా నిర్వహించాలనుకుంటాడు. భోజనాల కోసం పెద్ద ఎత్తున వేట మాంసం అవసరం కావడంతో అడవి జంతువులను వేటాడేందుకు అడవిలోకి అడుగు పెడతాడు. ఇలా అందరూ అడవిలోకి ప్రవేశించగానే అక్కడ ఊహించని సంఘటనలు చోటు చేసుకుంటాయి.అడవిలో ఏదో తెలియని శక్తి లేదా క్రూరమైన జంతువు తమను వేటాడుతుంటుంది. మరి ఈ పోరాటంలో చివరికి ఎవరు ప్రాణాలతో బయటపడ్డారన్నదే ఈ సినిమా కథ.

ప్రస్తుతం ఓటీటీలో టాప్ లో ట్రెండ్ అవుతోన్న ఈ సినిమాపేరు ఫారెస్ట్ గార్డ్. కథిర్, షైన్ టామ్ చాకో, హకీమ్ షాజహాన్, సుధి కొప్ప, జియో బేబీ తదితరులు ఈ మూవీలో కీలక పాత్రలు పోషించారు. ఎమ్సీ జోసెఫ్ ఈ సైకలాజికల్ సర్వైవల్ థ్రిల్లర్‌కు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్ ఫామ్ ఆహాలో అందుబాటులో ఉంది.

ఇవి కూడా చదవండి



ఫారెస్ట్ గార్డ్ సినిమా ట్రైలర్..



మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *