Headlines

Spirit: మరోసారి క్లారిటీ… తగ్గేదే లే అంటున్న ప్రభాస్‌ | Spirit Release Date: Prabhas Sandeep Reddy Vanga Film Release Rumours Get a Clear Answer video – Entertainment Videos in Telugu


ప్రభాస్‌ లైనప్‌లో భారీ అంచనాలు ఉన్న సినిమా ‘స్పిరిట్’. సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్‌లో వస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ రిలీజ్ డేట్‌ విషయంలో కొద్ది రోజులుగా రకరకాల వార్తలు వైరల్ అవుతున్నాయి. ఈ మూవీ వాయిదా పడుతుందన్న ప్రచారంతో ఫ్యాన్స్ కన్ఫ్యూజన్‌లో పడ్డారు. మరి ఈ రూమర్స్‌పై మేకర్స్ ఏమంటున్నారు స్పిరిట్ టీమ్ ప్లాన్ ఏంటి..? యానిమల్ లాంటి సెన్సేషనల్ హిట్ ఇచ్చిన సందీప్ రెడ్డి వంగా, ప్రభాస్‌ కాంబో అనగానే స్పిరిట్ మూవీ మీద ఎక్స్‌పెక్టేషన్స్ స్కై హైలో ఉన్నాయి. ఈ సినిమాలో ప్రభాస్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నారన్న హింట్స్ ఇప్పటికే ఫ్యాన్స్‌కు కిక్కిచ్చాయి. ఫస్ట్ లుక్‌లో రెబల్ స్టార్ అవతార్‌ సినిమా మీద బజ్‌ను పీక్స్‌కు తీసుకెళ్లింది. అయితే, వచ్చే ఏడాది మార్చి 5న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేసిన ఈ మూవీ పోస్ట్‌పోన్ అవుతుందన్న వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. సల్మాన్ ఖాన్ – వంశీ పైడిపల్లి కాంబోలో రానున్న ‘SVC63’ మూవీ కూడా వచ్చే ఏడాది మార్చిలోనే రానుండటంతో, స్పిరిట్ వాయిదా పడుతుందంటూ బాలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. స్పిరిట్‌ షూటింగ్ ఇంకా 75 రోజులు బ్యాలెన్స్ ఉందని, ప్రభాస్ వేరే ప్రాజెక్ట్స్ వల్ల డేట్స్ అడ్జస్ట్ కావడం లేదని, అందుకే జూన్ 2027కి పోస్ట్‌పోన్ చేస్తున్నారన్న న్యూ ట్రెండ్ అయ్యింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. ఈ రూమర్స్‌తో అలెర్ట్ అయిన మూవీ మేకర్స్ క్లారిటీ ఇచ్చారు. స్పిరిట్ విడుదలకు సంబంధించి ఎలాంటి మార్పూ లేదని, కచ్చితంగా ప్లాన్ ప్రకారమే వెళ్తున్నామని స్పష్టం చేశారు. మార్చి 5, 2027న ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో రిలీజ్ చేస్తామంటూ రూమర్స్‌కు ఫుల్ స్టాప్ పెట్టారు. తృప్తి దిమ్రీ హీరోయిన్‌గా, వివేక్ ఒబెరాయ్, కాంచన కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ మాఫియా బ్యాక్ డ్రాప్ మూవీ కోసం ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gaja 2026: గజ సినిమా టీజర్ టాక్.. మంచి రెస్పాన్స్ వస్తుంది..

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు

రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే!

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం!

LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *