Headlines

బన్నీ సినిమాలో హాలీవుడ్ హీరో విల్ స్మిత్..? | Hollywood Superstar Will Smith Reportedly in Talks for Allu Arjun’s Raka video – Entertainment Videos in Telugu


సినిమాలు మాత్రమే ఇంటర్నేషనల్ స్థాయిలో తెరకెక్కిస్తే ఎలా.. అందులో నటించే స్టార్స్ కూడా అలాగే ఉండాలి కదా..? అందుకే మన దర్శకులు ఇదే ప్రయత్నం చేస్తున్నారిప్పుడు. మన హీరోలకు తోడుగా హాలీవుడ్ స్టార్స్‌ని ఇండియన్ సినిమాకు పరిచయం చేస్తున్నారు. తాజాగా ఓ భారీ సినిమాలో ఏకంగా హాలీవుడ్ సూపర్ స్టార్ నటించబోతున్నారని తెలుస్తుంది. మరి అతనెవరు.. ఆ సినిమా ఏంటో ఎక్స్‌క్లూజివ్‌గా చూద్దామా..? ఇండియన్ సినిమా ఇంటర్నేషనల్ రేంజ్‌కు వెళ్తున్నపుడు.. టెక్నీషియన్స్‌తో పాటు నటులు కూడా అక్కడ్నుంచి వస్తే ఆ కిక్కే వేరు కదా..? తాజాగా అల్లు అర్జున్ రాకా సినిమా కోసం ఇదే జరగనుందని తెలుస్తుంది. ఈ సినిమా గురించి ఒక క్రేజీ అప్‌డేట్ వినిపిస్తుంది.. రాకాలో మెయిన్ విలన్‌గా హాలీవుడ్ సూపర్ స్టార్ విల్ స్మిత్‌ను తీసుకోబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. గత ఏడాదిగా అట్లీ, విల్ స్మిత్ మధ్య చర్చలు జరుగుతున్నాయని.. డేట్స్ మాత్రమే కాదు కాస్ట్యూమ్స్ కూడా రెడీ చేసారని తెలుస్తుంది. విల్ స్మిత్ కోసమే త్వరలో ఫారెన్ షెడ్యూల్ ప్లాన్ చేస్తున్నారని.. అందులో స్మిత్ జాయిన్ కానున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇదంతా గోప్యంగానే ఉంచారు మేకర్స్.. ఈ ప్రపోజల్ గానీ ఓకే అయితే ఇండియన్ సినిమాలో ఇంతకు మించిన సంచలనం మరోటి ఉండదు. ఒకవేళ నిజంగానే అల్లు అర్జున్, విల్ స్మిత్ కాంబో కలిస్తే రాకా పేరు ఇంటర్నేషనల్ రేంజ్‌లో మోగిపోవడం ఖాయం. కేవలం అట్లీ మాత్రమే కాదు.. మన దర్శకుల్లో చాలా మంది ఇలాంటి కొలాబరేషన్స్ కోసమే చూస్తున్నారు. ఆ మధ్య స్పిరిట్‌లో కొరియన్ నటుడు డాంగ్ లీని నటింపజేయడానికి చాలా ట్రై చేసారు సందీప్. చివరికి అది వర్కవుట్ కాలేదు కానీ డాంగ్ లీ పేరు మాత్రం మన దగ్గర బాగా ట్రెండ్ అయ్యారు. రాజమౌళి కూడా ఇంటర్నేషనల్ వర్కింగ్ స్టైల్‌కు అలవాటు పడుతున్నారు. ఆల్రెడీ ట్రిపుల్ ఆర్‌లో ఒలివియా మోరీస్, రే స్టీవెన్‌సన్, అలిసన్ డూడీ లాంటి స్టార్స్‌ను తీసుకున్న ఈయన.. వారణాసి కోసం మరికొందరు ఇంగ్లీష్ యాక్టర్స్‌ను తీసుకుంటున్నారు. మొత్తానికి ఇంటర్నేషనల్ కలయికతో మన సినిమాల రేంజ్ అలా పెరిగిపోతుందిప్పుడు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

Gaja 2026: గజ సినిమా టీజర్ టాక్.. మంచి రెస్పాన్స్ వస్తుంది..

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు

రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే!

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం!

LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *