Headlines

స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో బురఖా డాన్స్‌.. స్కూల్‌ను సీజ్‌ చేసిన అధికారులు | Uttar Pradesh School Row: Students Made to Dance in Burqas During Independence Day Event video tv9d – Viral Videos in Telugu


స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల సందర్భంగా ఉత్తరప్రదేశ్‌లోని ఓ పాఠశాలలో చోటుచేసుకున్న ఘటన తీవ్ర వివాదాస్పదమైంది. గోండా జిల్లాలోని బాబాన్‌జోత్ ప్రాంతంలో ఓ పాఠశాలలో స్వాతంత్ర్య దినోత్సవం రోజున కొందరు విద్యార్థినులతో బురఖా ధరింపజేసి సినిమా పాటలకు డ్యాన్స్ చేయించారు. హిందూ అమ్మాయిలకు బురఖా వేసి నృత్యాలు చేయించిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో స్థానికంగా కలకలం రేగింది. ఈ ఘటనపై విద్యాశాఖ అధికారులు తీవ్రంగా స్పందించారు. స్థానిక విద్యాశాఖ అధికారి అమిత్ కుమార్ సింగ్ ఆదేశాల మేరకు బ్లాక్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రియాజ్ అహ్మద్ ఆ పాఠశాలలో తనిఖీలు చేపట్టారు. విచారణలో అసలు నిజాలు వెలుగులోకి వచ్చాయి. ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే ఆ పాఠశాలను అక్రమంగా నిర్వహిస్తున్నట్లు తేలింది. వాస్తవానికి ఆ పాఠశాల నిర్వహణను నిలిపివేయాలని అధికారులు వారం క్రితమే ఆదేశాలు జారీ చేశారు. అయితే ఆ ఉత్తర్వులను బేఖాతరు చేస్తూ యాజమాన్యం స్కూల్‌ను యథావిధిగా కొనసాగించింది. దీంతో ఆగ్రహించిన అధికారులు కఠిన చర్యలకు ఉపక్రమించారు. స్కూల్ మేనేజర్ కార్యాలయంతో పాటు ప్రిన్సిపాల్ రూమ్‌కు తాళాలు వేసి, పాఠశాల ప్రధాన గేటును సీజ్ చేశారు. ఈ మొత్తం ఘటనపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులకు పూర్తి నివేదిక అందజేశారు. మరోవైపు విద్యార్థుల చదువుకు ఎలాంటి భంగం కలగకుండా, ఆ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులందరినీ సమీపంలోని ప్రభుత్వ మరియు గుర్తింపు పొందిన ఇతర పాఠశాలల్లో చేర్పించినట్లు అధికారులు వెల్లడించారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రూమ్‌లో హాయిగా నిద్రపోతున్న వ్యక్తి.. ఆ తర్వాత సీన్‌ చూస్తే వెన్నులో వణుకే!

యూట్యూబ్ వ్యూస్ లెక్కింపులో కీలక మార్పు.. ఆగస్టు 24 నుంచి కొత్త విధానం!

LPG: ఎల్పీజీ గ్యాస్ కస్టమర్లకు అదిరిపోయే శుభవార్త!

లోన్ తీసుకునే వారికి అదిరిపోయే శుభవార్త! బ్యాంకుల ఇష్టారాజ్యానికి చెక్!

అమానుషం.. తోటి విద్యార్థినులతో మూత్రం తాగించిన బాలుడు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *